పాము నోట్లో ఎన్ని దంతాలు ఉంటాయో తెలుసా? మీరస్సలు ఊహించలేరు.

పాములు ప్రమాదకరమైన జీవులు. అయితే వీటిల్లో అన్ని రకాల పాములు విషపూరితమైనవి కావు. అయినప్పటికీ వీటిని చూస్తే చాలా మందికి హడల్. ఎందుకంటే పాము కాటు వెంటనే మరణానికి దారితీస్తుంది. అయితే పాము నోట్లో ఎన్ని దంతాలు ఉంటాయో మీకు తెలుసా?

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జంతువులలో పాములు ఒకటి. పాములు నాలుకను బయటకు పెట్టి లోపలికి చాపడం మీరు చూసే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా పాము నోట్లో దంతాలను చూశారా? అసలు పాముకి ఎన్ని దంతాలు ఉంటాయో మీకు తెలుసా?


పాము నోటిలో మహా అయితే 8 నుంచి 10 వరకు దంతాలు ఉంటాయని మీరు అనుకోవచ్చు. కానీ మీ ఊహ తప్పు. సగటున ఒక పాము నోట్లో 100 నుండి 200 వరకు దంతాలు ఉంటాయట.

భూమిపై 400 కంటే ఎక్కువ జాతుల పాములు ఉన్నాయి. జాతులను బట్టి దంతాల సంఖ్య మారుతుంది. కొన్ని పాములకు 200 వరకు దంతాలు ఉంటాయి. అయితే కింగ్ కోబ్రా వంటి విషపూరిత పాములకు 100 కంటే తక్కువ దంతాలు ఉంటాయి.

పాములు తమ దంతాలతో ఎరను పట్టుకోవడానికి, విషాన్ని ఇంజెక్ట్ చేయడానికి ఉపయోగిస్తాయి. అయితే పాములు ఆహారాన్ని కొరకడానికి తమ దంతాలను ఉపయోగించవు.

కోబ్రా వంటి ఇతర విషపూరిత పాములకు విషపూరిత కోరలు ఉంటాయి. ఇవి 2 లేదా 4 ఉండవచ్చు. వీటిని విషాన్ని ఇంజెక్ట్ చేయడానికి ఉపయోగిస్తాయి. విషం లేని పాములకు విషపూరిత కోరలు ఉండవు. వీటి చిన్న దంతాలు ఎరను పట్టుకోవడానికి ఉపయోగిస్తాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.