కుడి చేత్తో చేసిన సహాయం.. ఎడమ చేతికి తెలియకూడదని సామేత మెగాస్టార్‌కు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. మనకు తెలిసినవి కొన్నే.. కానీ, మెగాస్టార్ వల్ల ప్రతీ రోజు ఏదో విధంగా ఎవరో ఒకరు సహాయం పొందుతూనే ఉన్నారు. గ్రౌండ్ రియాల్టీ తెలియక చాలా మంది కోట్లు కోట్లు సంపాదిస్తుంటారు. కానీ హెల్ప్ చేయడానికి కూడా ముందుకు రారు అంటూ మాట్లాడతారు. కానీ మనకు తెలియకుండా సినిమా వాళ్లు చేసే సహాయాలు ఎన్నో ఉంటాయి.
అందులో మెగాస్టార్ వల్ల ప్రతీ రోజు ఏదో విధంగా చాలా మందికి సహాయం అందుతుంది. ఊరికు అయిపోరుగా మెగాస్టార్‌లు. అంతేకాదు.. చిరంజీవి ఒక్క రోజు ఖర్చు అక్షరాల రూ.25 లక్షలట. చిరంజీవి వరకు చేరిన ప్రతీ ఒక్కరికి చాలా పెద్ద మొత్తంలో సహాయం అందుతుందట. హాస్పిటల్ ఖర్చులని, పిల్లల స్కూల్ ఫీజ్‌లని.. ఫైనాన్షియల్‌గా ఇబ్బందుల్లో ఉన్నవాల్లకు డబ్బులివ్వడంగాని.. ఇలా ఏదో విధంగా ప్రతీ రోజు సహాయం అందుతుందట. అలా ప్రతీ రోజు రూ.25 లక్షలు వరకు మెగాస్టార్ ఖర్చు పెడతాడట. అంటే ఊర్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పదేళ్లు ఈజీగా బ్రతకొచ్చు.
ఇక సినిమా ఇండస్ట్రీ ఒక పుస్తకం అయితే.. అందులో టాప్ 5 పేజీస్‌లో చిరంజీవి పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆయన చూడని బ్లాక్ బస్టర్‌లు, ఇండస్ట్రీ హిట్లు లేవు. అలానే ఆయన చూడని ఫ్లాప్‌లు లేవు. కానీ.. అభిమానగళం ఎప్పుడూ కూడ తగ్గలేదు. అన్నయ్య అన్నయ్య అంటూ ఇప్పటికీ మన నాన్నల తరం సొంత అన్నలా అభిమానిస్తుంటారు.
మాములుగా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ చిరంజీవికి హీరోల్లోనే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అసలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఈ స్థాయికి రావడం అంటే మాములు విషయం కాదు. 7 పదుల వయసులోనే రికార్డులు తిరగరాసే సినిమాలు చేస్తూ.. కుర్ర హీరోలకు పోటీనిస్తున్నాడు.
రీసెంట్‌గా ఆయన నటించిన మన శంకర వరప్రసాద్ గారూ సినిమా సంక్రాంతి పండగకు రిలీజై అరివీర భయంకర హిట్టు కొట్టింది. దాదాపు రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి.. రీజినల్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్టుగా నిలిచిపోయింది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అక్షరాల రూ.160 కోట్ల షేర కలెక్షన్లు సాధించడం అంటే మాములు విషయం కాదు.
అసలు ఈ సినిమాలో లిటరల్‌గా వింటేజ్ మెగాస్టార్‌ను చూశాం. ఆయన డ్యాన్స్ ఎనర్జీ, కామెడీ టైమింగ్, యాక్షన్ స్టంట్స్.. ఇలా మెగాస్టార్ నుంచి కంప్లీట్ ప్యాకేజ్‌ను చాలా ఇయర్స్ తర్వాత చూశాం. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైనమెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

































