పర్సనల్ లోన్ కట్టకపోతే బ్యాంకులు ఏం చేస్తాయో తెలుసా?

ఈ కాలంలో డబ్బు సంపాదించడం కష్టం.. కానీ అప్పు తీసుకోవడం పెద్ద సమస్య లేకుండా మారింది. ఒకప్పుడు అప్పు కావాలంటే మరో వ్యక్తిని సంప్రదించి వారి ద్వారా ఎక్కువ వడ్డీ చెల్లించి అయినా సరే.. అప్పు తీసుకునేవారు. కానీ ఇప్పుడు కాస్త క్రెడిట్ స్కోర్ బాగుంటే బ్యాంకులే వెంటపడి మరి అప్పులు ఇస్తున్నాయి. దీంతో వినియోగదారులు తమకు ఆఫర్లు వస్తున్నాయని భావించి.. అవసరం లేకున్నా బ్యాంకు రుణాలు తీసుకుంటూ ఉన్నారు. ఇలా తీసుకున్న బ్యాంకు రుణాల్లో.. వ్యక్తిగత రుణాలే ఎక్కువగా ఉంటున్నాయి. చిన్న చిన్న వాటికి కూడా వ్యక్తిగత రుణాలు తీసుకొని ఈఎంఐ లు చెల్లిస్తూ ఉన్నారు. అయితే ఒక్కోసారి దురదృష్టవశాత్తు ఈఎంఐలు చెల్లించని పరిస్థితుల్లో బ్యాంకులు అదనంగా భారీగా వడ్డీని విధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో బ్యాంకులు వడ్డీ విధించడం మాత్రమే కాకుండా.. ఏం చేస్తాయో తెలుసా?


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం వ్యక్తిగత రుణాలు ఇవ్వడం వరకు బాగానే ఉంటుంది. కానీ వాటిని వసూలు చేయడంలో మాత్రం కఠినంగా ఉంటాయి. ఎందుకంటే ఒక వ్యక్తి ఈఎంఐ చెల్లించని పక్షంలో అతని గురించి బ్యాంకులు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమాచారంతో ఆ కంపెనీ వ్యక్తికి సంబంధించిన క్రెడిట్ స్కోర్ ను తగ్గిస్తూ ఉంటారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి సీఈసీకి బ్యాంకు ఖాతాదారుడి సమాచారం వెళ్తే.. భవిష్యత్తులో మరో క్రెడిట్ కార్డు గాని.. ఇతర రుణాలు గాని ఇచ్చే అవకాశం ఉండదు.

పర్సనల్ లోన్ తీసుకున్న వారికి ఎప్పటికప్పుడు మెసేజ్లు, కాల్స్ వంటి వాటి ద్వారా సమాచారం అందిస్తూ ఉంటాయి. అయినా కూడా వాటి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే.. కో అప్లికేంట్ ను సంప్రదిస్తాయి. అంటే బ్యాంకు రుణం తీసుకునే సమయంలో ఎవరైతే షూరిటీగా ఉంటారో వారిని రుణం గురించి అడుగుతూ ఉంటారు. దీంతో ఎవరైతే షూరిటీగా సంతకం చేస్తారో వారు, లోన్ తీసుకున్న వారి మధ్య సంబంధాలు తెగిపోతాయి. ఇవి భవిష్యత్తులో మరింత ఉదిత్తతకు దారి తీసే అవకాశం ఉంటుంది.

రెగ్యులర్గా రుణాలు చెల్లించని వారికి మెసేజ్లు, ఫోన్లో ద్వారా సమాచారం ఇస్తారు. అయినా కూడా స్పందించకపోతే నోటీసులు అందిస్తారు. నోటీసులను కూడా పట్టించుకోకపోతే కేసు నమోదు చేస్తారు. దీని ద్వారా ఆస్తులు లేదా ఇతర విషయాల్లో చర్యలు ఉండే అవకాశం ఉంటుంది.

అయితే ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ముందే ప్లానింగ్ వేసుకోవాలి. ఈఎంఐ చెల్లించే గడువు తేదీ ముందే బ్యాంకులో అమౌంట్ వేసే ప్రయత్నం చేయాలి. ఈఎంఐ మిస్ అయితే బ్యాంకు 1.6% వడ్డీ వేసే అవకాశం ఉంటుంది. ఇది వారానికి ఒకసారి మారిపోతూ ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకులో డబ్బు వేసే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ముందుగానే కొంతవరకు ఎమర్జెన్సీ ఫండ్ ను ఏర్పాటు చేసుకోవాలి. వీటి ద్వారా కొన్ని అవసరాలను తీర్చుకోవచ్చు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.