భారతదేశ జాతీయ జెండా త్రివర్ణ పతాకం.. దేశ స్వేచ్ఛ, ఐక్యత , గౌరవానికి చిహ్నం. త్రివర్ణ పతాకంలో ఉన్న మూడు రంగులు చాలా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఆ మూడు రంగులకు అర్ధం ఏమిటి అనేది నేటి జనరేషన్ లో అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ నేపధ్యంలో ఈ రోజు త్రివర్ణ పతాకంలోని మూడు రంగులకు ఉన్న అర్ధం ఏమిటి? ఈ మూడు రంగులు దేనిని సూచిస్తాయి? అవి మనకు ఏమి బోధిస్తాయి తెలుసుకుందాం.
స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాన్ని ప్రతి ఏడాది ఆగస్టు 15 న జరుపుకుంటాం. ఈ రోజు మన దేశానికి ఒక చారిత్రాత్మక రోజు. 1947లో ఈ రోజున మన దేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది. ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధానమంత్రి ఎర్రకోటపై జెండాను ఎగురవేసి.. దేశ స్వాతంత్యం సమరయోధులను తలచుకుని నివాళులు అర్పిస్తారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
భారత దేశ జాతీయ జెండా త్రివర్ణ పతాకం. ఇది మన స్వాతంత్ర్యానికి చిహ్నం. దీనిలో మూడు రంగులున్నాయి. కాషాయం, తెలుపు , ఆకుపచ్చ రంగులతో పాటు అశోక చక్రం ప్రత్యేకమైన సందేశాన్ని అందిస్తాయి. త్రివర్ణ పతాకంలోని మూడు రంగులకు ఉన్న అర్ధం ఏమిటో తెలుసుకుందాం.
త్రివర్ణ పతాకం ఏ సైజ్ లో ఉండాలంటే త్రివర్ణ పతాకం పొడవు .. వెడల్పు 3:2 నిష్పత్తిలో ఉండాలి. దీనికి మూడు రంగులు సమానంగా ఉండాలి. మధ్యలో అశోక చక్రం ఉంటాయి. అశోక చక్రం నీలం రంగుతో మధ్య భాగంలో 24 గీతలతో ఉంటుంది.
కాషాయం రంగు అర్థం త్రివర్ణ పతాకం పైభాగంలో కాషాయ రంగు ఉంటుంది. ఈ రంగు దేశ బలం , ధైర్యాన్ని చూపుతుంది. ఇది మన దేశ వీరుల ధైర్యానికి చిహ్నం. ఈ రంగు త్యాగం , దేశభక్తికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది.
తెలుపు రంగుకి అర్థం త్రివర్ణ పతాకంలోని తెలుపు రంగు శాంతి, సత్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ రంగు భారతదేశం శాంతిని ప్రేమించే దేశమని , అహింసను నమ్ముతుందని చూపిస్తుంది. ఈ తెలుగు రంగు మధ్యలో ఉన్న చక్రాన్ని ధర్మ చక్రం లేదా అశోక చక్రం అని అంటారు. ఇది మన దేశ నిరంతర పురోగతికి చిహ్నం.
ఆకుపచ్చ రంగు అర్థం త్రివర్ణ పతాకంలోని మూడవ రంగు ఆకుపచ్చ రంగు. మన దేశ పచ్చదనం, అభివృద్ధికి చిహ్నం. భారతదేశం వ్యవసాయ దేశం. ఈ త్రివర్ణ పతాక రంగు వ్యవసాయం , పచ్చదనం ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తుంది.
అశోక్ చక్రం ప్రత్యేకత ఏమిటి? త్రివర్ణ పతాకంలోని తెల్లని రంగు మధ్యలో ఉన్న ముదురు నీలం రంగు వృత్తాన్ని అశోక చక్రం అంటారు. ఇది అశోక స్తంభంపై ఉన్న వృత్తం నుంచి తీసుకున్నారు. దీని లోపల 24 గీతలు ఉంటాయి. ఇవి రోజులోని 24 గంటలను సూచిస్తాయి. ఈ గీతల్లో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన విలువను సూచిస్తుంది. సత్యం, ధర్మం, శాంతి, అహింస వంటివి. అశోక చక్రం నిరంతరం ముందుకు సాగమని బోధిస్తుంది.
త్రివర్ణ పతాకానికి ఎప్పుడు జాతీయ హోదా వచ్చిందంటే ఈ త్రివర్ణ పతాకాన్ని పింగళి వెంకన్న రుపొందించారు. 1947 జూలై 22న రాజ్యాంగ సభ త్రివర్ణ పతాకానికి భారత జాతీయ జెండా హోదాను ఇచ్చింది. మన త్రివర్ణ పతాకం మన దేశ గర్వం , స్వాతంత్ర్యానికి చిహ్నం. అందుకే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసే సమయంలో అనేక నియమాలను పాటిస్తారు. గౌరవంగా ఎగురవేస్తారు.
































