పెన్ను చిన్నదైనా, విద్యార్థుల నుంచి వృత్తిపరుల వరకు ఉపయోగం ఎప్పటికీ తగ్గదు. 1809లో ఆర్థర్ ఫౌలర్ సిరా పెన్నుకి పేటెంట్ పొందారు. 1910లో డాక్టర్ రాధికా నాష్ భారతదేశపు మొదటి ఫౌంటెన్ పెన్నును రూపొందించారు.
పెన్ను… ఒక చిన్న వస్తువు అయినా, ఎంతో గొప్ప పని చేస్తుంది. రాసే ప్రతి ఒక్కరి చేతిలో ఇది తప్పనిసరిగా ఉంటుంది. విద్యార్థులు నుంచి వృత్తిపరుల వరకు, నోట్స్ నుంచి సంతకాల వరకు – పెన్ను ఉపయోగం ఎప్పటికీ తగ్గదు. కానీ ‘పెన్ను’ అనే పదానికి అసలు అర్థం ఏమిటో చాలా మందికి తెలియదు. ఈ చిన్న ఆయుధం వెనక ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఇప్పుడదే తెలుసుకుందాం.
“కలము విద్యార్థుల ఆయుధం, జర్నలిస్టుల కత్తి” అని ఎందుకు అంటారో మీకు తెలుసా? ఎందుకంటే ఇది సామాన్యంగా కనిపించినా, ఏ భావాన్ని అయినా ప్రబలంగా వ్యక్తపరచగల శక్తి కలిగినది. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్లు వచ్చినా… పెన్ను స్థానం మరవలేనిది. రోజూ ఎన్నో వందలాది మంది తమ భావాలను పేపర్‌పై ముద్రించేందుకు పెన్నునే ఆధారంగా తీసుకుంటున్నారు.
పెన్ను అభివృద్ధి ఒక పెద్ద ప్రయాణం. 1809లో ఇంగ్లాండ్‌కు చెందిన ఆర్థర్ ఫౌలర్ సిరా పెన్నుకి మొదటి పేటెంట్ పొందారు. అయితే, ప్రపంచంలో మొట్టమొదటి ఫౌంటెన్ పెన్నును పారిస్‌కు చెందిన పేత్రాచే పోయెన్నెరో అనే వ్యక్తి రూపొందించి, 1827లో ఫ్రెంచ్ ప్రభుత్వానికి పేటెంట్ కూడా పొందారు.
అంతేకాదు, 1850ల నుంచి ఫౌంటెన్ పెన్నులు పెద్ద ఎత్తున తయారవడం మొదలైంది. దీని వల్ల సాధారణ ప్రజలకు కూడా పెన్ను అందుబాటులోకి వచ్చింది. మన దేశానికి వస్తే… భారతదేశపు మొట్టమొదటి ఫౌంటెన్ పెన్నును డాక్టర్ రాధికా నాష్ రూపొందించారట! 1910లో దీనికి పేటెంట్ కూడా తీసుకున్నారు.
పెన్నులు ఇప్పుడు ఎన్నో రకాలుగా దొరుకుతున్నాయి. నీలం సిరా పెన్ను అత్యంత ప్రాచుర్యం పొందింది. అలాగే నలుపు, ఎరుపు, ఆకుపచ్చ వంటి రంగుల్లో కూడా పెన్నులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎరుపు సిరా పెన్నులను ఎక్కువగా ఉపాధ్యాయులు, ఎడిటర్లు ఉపయోగిస్తుంటారు. మరింత స్టైలిష్‌గా ఉండే జెల్ పెన్నులు, బాల్‌పాయింట్ పెన్నులు, స్కెచ్ పెన్నులు, మార్కర్‌లు, బటన్ నొక్కి నిబ్ విడుదలయ్యే క్లిక్ పెన్నులు వంటి ఎన్నో రకాలు మార్కెట్‌లో లభ్యం.
అత్యంత చౌకగా ఒక రూపాయి నుంచి మొదలై, వెయ్యికి పైగా ధర కలిగిన ప్రీమియం పెన్నులు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. అది స్టూడెంట్ అయినా, సీఈఓ అయినా – ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పెన్ను ఇష్టం.
‘Pen’ అనే పదం చిన్నదిగా కనిపించినా, దీని వెనక అర్థం పెద్దదే. ఇది ఒక సంక్షిప్త రూపం. దీని పూర్తి రూపం ఏమిటో మీకు తెలుసా? “Poets, Essayists, Novelists” అంటే, కవులు, వ్యాసకర్తలు, నవలా రచయితలు. అంటే రచనలో ఉండే మేధస్సును ప్రతినిధించే పదమే “పెన్ను”. ఇప్పుడైనా ఈ విషయం తెలుసుకోవడం చక్కగానే ఉంది కదూ?
ఈ డిజిటల్ యుగంలో మనం కంప్యూటర్ల మీద టైప్ చేస్తాం, స్క్రీన్ మీద రాస్తాం. కానీ చివరికి ఓ సంతకం పెట్టాలంటే పెన్నే కావాలి. ఆధార్ అప్లికేషన్ పెట్టినా, బ్యాంకులో చెక్కు సైన్ చేసినా, పెన్ను అవసరమే. పెన్ను లేకుండా ఎవరూ ఉండలేరు అనడంలో సందేహం లేదు. ఇది మన జీవితంలో భాగం అయిపోయింది. పెన్ను మనకు స్నేహితుడిలా సహాయపడుతుంది. మన ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు – అన్నింటినీ కాగితంపై ముద్రించేది పెన్నే. మనం దానిని శ్రద్ధగా, జాగ్రత్తగా వాడితే… అది ఎప్పటికీ మనతోనే ఉంటుంది.