మనిషి మధ్య వయసు ఎంతో తెలుసా.. 50 మాత్రం కాదండోయ్

ప్రస్తుత కాలంలో మనిషి ఎక్కడ కూర్చుంటే అక్కడే భూగోళంలో ఏం జరిగినా తెలుసుకునే పరిస్థితికి వచ్చారు. ఈ క్రమంలోనే మానవ జీవనశైలి ఎంత ఈజీ అయిపోయిందో, శారీరక శ్రమ కూడా అంతే తగ్గిపోయింది.


ఇదంతా బాగానే ఉన్నా రాను రాను శారీరక శ్రమ లేకపోవడం వల్ల మనిషి ఆయుః ప్రమాణం కూడా పూర్తిగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఒకప్పుడు సాధారణంగా మన తాతలు వాళ్ల తాతలు 100 ఏళ్లకు పైగా బతికేవారు. వాళ్లకు 90 ఏళ్లు నిండే వరకు కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండేవి కావు. కానీ ప్రస్తుత కాలంలో ఇలాంటి మనుషులను ఊరుకొక్కరిని కూడా చూడలేకపోతున్నాం. కొద్దీ సంవత్సరాలలైతే అసలు వందేళ్లు బతికే మనిషి కోసం గూగుల్ లో వెతకాల్సిందే.

అలాంటి ఈ క్రమంలోనే మానవుని ఆయుః ప్రమాణం అనేది రోజురోజుకు తగ్గుకుంటూ వస్తోంది. దీనికి కారణాలేంటి అనేది చూద్దాం.. ఒకప్పుడు మధ్య వయస్సు అంటే 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండేది. కానీ ఇప్పుడు మధ్య వయస్సు అంటే 36 సంవత్సరాల మధ్య ఉంటుంది. 36 సంవత్సరాల లోపు చాలామంది యువకులు యాక్టివ్ గా ఉన్నట్టు కనిపిస్తారు. కానీ 36 దాటితే వారి లోపల ఏం జరిగిందనేది మెల్లిమెల్లిగా బయటకు వస్తోంది. అంటే సగటు మనిషి జీవితం 36 దాటితే సగం జీవితం అయిపోయినట్టే.. ప్రస్తుతం సగటు మనిషి జీవితం 72 సంవత్సరాలు. ఈ వయసు వచ్చింది అంటే వారి పూర్తి జీవితం అయిపోయినట్టే అన్నట్టు భావిస్తున్నారు. ఒకవేళ ఇది దాటి కూడా బ్రతుకుతున్నారు అంటే అది బోనస్ కిందే లెక్క..

1840 సంవత్సరంలో చాలామంది 40 ఏళ్ల వరకు బతికితే చాలు అనుకునేవారు.. ఎందుకంటే ఆ సమయంలో ఎక్కువగా వైద్యరంగం డెవలప్ అవ్వలేదు. దీంతో చాలామంది పుట్టిన వెంటనే చనిపోతూ వచ్చేవారు. కొంతమంది వయసు పెరిగిన తర్వాత వైద్యం అందక చనిపోయేవారు.అందుకే ఆ సమయంలో చాలామంది 10-12 మంది పిల్లల్ని కనేవారు. అందులో కొంతమంది చనిపోయినా మిగతా వారంతా బతికేవారు. కానీ సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత ఒకరిద్దరి పిల్లల్ని కనాలనే నినాదంతో ప్రజలు బ్రతుకుతున్నారు. అలా టెక్నాలజీ అభివృద్ధి చెందిన కొద్దీ మనిషి ఆయుః ప్రమాణం అనేది తగ్గుకుంటూ వస్తోంది.

అయితే తాజాగా ఫిన్ ల్యాండ్ కు చెందినటువంటి జైవస్కైలా అనే యూనివర్సిటీ వాళ్ళు 30 ఏళ్ల పాటు సాగించిన ఒక పరిశోధన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక మనిషి తన యుక్త వయసులో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు ఆయనకు ఉన్న ఆహారపు అలవాట్లను బట్టి తను 36 సంవత్సరాల తర్వాత అనుభవించే ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. 36 సంవత్సరాల లోపు మద్యం,గుట్కా,సిగరెట్ లాంటి అలవాట్లు ఎక్కువగా ఉంటే 36 సంవత్సరాల తర్వాత అవన్నీ బయటపడతాయని అప్పటినుంచి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రస్తుత కాలంలో సగటు మానవుడి సగం వయసు అంటే 36 సంవత్సరాలనే జమ కడుతున్నారు. ఈ ఏజ్ దాటిందంటే ఏదో ఒక రోగం అటాక్ అవుతుందని,దాని తర్వాత టాబ్లెట్ల మీదనే బతకాల్సి వస్తుందని కూడా తెలియజేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.