శివుడు గణేశుడి తలను నరికిన అనంతరం ఆ బాలుడి శరీరానికి ఉత్తర దిశలో నిద్రపోతున్న ఏనుగు తలను తీసుకువచ్చి.. జోడించి ప్రాణం పోశారు. ఈ గణేశుడికి ప్రాణం పోసిన కథ గురించి అందిరకీ తెలిసిందే.
అయితే ఒక ఆలయంలో వినకుడు తల లేకుండా పూజలందుకుంటున్నాడు. . ఈ ప్రత్యేక వినాయక దేవాలయం గురించి ఈ రోజు తెలుసుకుందాం..
వినాయకుడు జ్ఞానం, సంపదలకు అధిపతి. ఏదైనా శుభ కార్యాన్ని ప్రారంభించే ముందు వినాయకుడిని పూజిస్తారు. హిందువులందరికీ ఇష్టమైన దేవుడు. సర్వ విఘ్నాలను నివారించే గణేశుడి ఆలయాలు దేశమంతటా కనిపిస్తాయి.
భారతదేశంలో అనేక పురాతన, పవిత్రమైన గణేశ దేవాలయాలు ఉన్నాయి. వినాయక చవితి రోజున వినాయక గుడికి వెళ్లే వారు ఎక్కువ. అయితే అతి తక్కువ మందికి మాత్రమే తల లేని గణేశుడి విగ్రహం గురించి తెలుసు..
పురాణాల ప్రకారం శివుడు తనని అడ్డుకున్న బాలుడి తలని కోపంతో నరికివేశాడు. అనంతరం ఆ బాలుడికి ఏనుగు తలని అతికించి జీవం పోశారు. అయితే ఈ ఆలయం ఉన్న దేవభూమిలోనే బ్రహ్మాది దేవతలు ఏనుగు తలను బాలుడికి జోడించి ప్రాణం పోశారని నమ్మకం. ఇదే విషయం స్థానికులు చెబుతారు.
ముండ్‌కతీయ అనే ఆలయం ఉత్తరాఖండ్ లోని కేదార్ లోయలో ఉంది. ఇక్కడ తల లేని గణేశుడిని పూజిస్తారు. ఇది రాష్ట్రంలోని సోన్‌ప్రయాగ్ నుండి 3 కి.మీ దూరంలో ఉంది
ఉత్తరాఖండ్ ని దేవభూమి అంటారు. శివ, కేశవులతో పాటు అనేక మంది దేవుళ్ళ ఆలయాలున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి ముండ్‌కతీయ అనే ఆలయం. ఇక్కడే బాలుడి తలను తొలగించి ఏనుగు తలను అతికించాడు. అందుకే ఈ ప్రాంతానికి ముండికతీయ అనే పేరు వచ్చిందని చెబుతారు.