ఎన్నికల్లో వేసే సిరా గుర్తు ఎందుకు చెరిగిపోదో తెలుసా?

సాధారణంగా ఓటు వేసేవాళ్లకు ఈ సిరా గుర్తు గురించి తెలిసే ఉంటుంది. ఓటు వేశాక సిరా గుర్తును ఎడమ చేయి చూపుడు వేలుపై వేస్తారు. దీంతో ఆ వ్యక్తి ఓటు వేసినట్టు లెక్క. ఎన్నికల్లో రిగ్గింగ్, డబుల్ ఓట్లు లాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకే ఈ సిరా చుక్కను ఓటు వేసిన వ్యక్తుల వేలికి వేస్తారు. అయితే.. ఆ సిరా చుక్క కనీసం మూడు నుంచి నాలుగు రోజుల దాకా ఉంటుంది. అప్పటి వరకు అది ఎంత చెరిపినా చెరగదు. మరి.. ఆ సిరా గుర్తు ఎందుకు చెరగదో తెలుసా?


సిరా గుర్తు మూడు నుంచి నాలుగు రోజుల దాకా ఉండేందుకు దాంట్లో ఎక్కువ శాతం సిల్వర్ నైట్రేట్ ను కలుపుతారు. దాదాపు 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉంటుందట ఇందులో. అందుకే అది వెంటనే చెరిగిపోదు. అది దాని చరిత్ర అన్నమాట.