బ్రష్‌ చేసిన వెంటనే నీళ్లు ఎందుకు తాగకూడదో తెలుసా? సైన్స్ సీక్రేట్‌ ఇదే..

చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే నీళ్లు తాగడం,రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవడం అలవాటు. కానీ బ్రష్‌ చేసిన వెంటనే నీరు తాగకూడదని ఇంట్లో పెద్దొళ్లు చెబుతుంటారు. కానీ దీని వెనుక కారణం ఏమిటి? అని మీరెప్పుడైనా ఆలోచించారా? నిజానికి.. బ్రష్ చేసిన తర్వాత టూత్‌పేస్ట్ నుండి వచ్చే ఫ్లోరైడ్ పలుచని పొర..

చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే నీళ్లు తాగడం,రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవడం అలవాటు. కానీ బ్రష్‌ చేసిన వెంటనే నీరు తాగకూడదని ఇంట్లో పెద్దొళ్లు చెబుతుంటారు. కానీ దీని వెనుక కారణం ఏమిటి? అని మీరెప్పుడైనా ఆలోచించారా? నిజానికి.. బ్రష్ చేసిన తర్వాత టూత్‌పేస్ట్ నుండి వచ్చే ఫ్లోరైడ్ పలుచని పొర మన దంతాలపై పేరుకుపోతుంది. ఈ పొర బ్యాక్టీరియాతో పోరాడుతుంది. ఎనామిల్‌ను బలపరుస్తుంది.


ఫ్లోరైడ్ పని దంతాలను కావిటీస్ నుంచి రక్షించడం, ఎనామిల్ దెబ్బతినకుండా నిరోధించడం. కానీ ఈ ప్రక్రియ జరగాలంటే అది కొంతకాలం దంతాలపై ఉండాలి. మీరు బ్రష్ చేసిన వెంటనే నీరు తాగినా, నోరు శుభ్రం చేసుకున్నా ఈ ఫ్లోరైడ్ త్వరగా కొట్టుకుపోతుంది. ఫలితంగా టూత్‌పేస్ట్ ప్రభావం అసంపూర్ణంగా ఉంటుంది. దీంతో మీ దంతాలు కావిటీస్ నుంచి పూర్తిగా రక్షణ పొందవు.

దంతవైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఫ్లోరైడ్ దాని ప్రభావాన్ని చూపించడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. అప్పుడే అది ఎనామెల్‌ను బలోపేతం చేస్తుంది. మీరు ఆరోగ్యకరమైన దంతాలను కోరుకుంటే బ్రష్ చేసిన తర్వాత కొంత సమయం నీళ్లు తాగకుండా వేచి ఉండాలి.

బ్రష్ చేసిన వెంటనే నీళ్ళు మాత్రమే కాకుండా టీ, కాఫీ లేదా మరేదైనా పానియం తాగడం మానుకోవాలి. ఈ ఒక్క అలవాటు మీ దంతాలను బలంగా ఆరోగ్యంగా ఎక్కువ కాలం ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి బ్రష్ చేసిన వెంటనే నీరు తాగవద్దు. బ్రష్ చేసిన తర్వాత కనీసం 15 నిమిషాల తర్వాత మాత్రమే ఏదైనా తాగాలి. ఇది ఆరోగ్యకరమైన చిరునవ్వును కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది.

మీ దంతాలను బలోపేతం చేయడానికి, కావిటీస్ నుంచి విముక్తి పొందడానికి వైద్యులు ఎల్లప్పుడూ రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవాలని సిఫార్సు చేస్తుంటారు. ఎందుకంటే టూత్‌పేస్ట్‌లోని ఫ్లోరైడ్ మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.