మీకు యాక్షన్ సినిమాలు ఇష్టమా? OTTలో హిట్ అయిన 230 కోట్ల సినిమా

ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేశాయి. అలాగే హీరో, హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ కూడా ఆకట్టుకుంది. థియేటర్లలో 235 కోట్ల కలెక్షన్లు రాబట్టిన మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ వారం థియేటర్లలో భైరవం, షష్టి పూర్తి సినిమాలు మాత్రమే థియేటర్లలో కి వచ్చేశాయి. మరోవైపు ఓటీటీల్లో మాత్రం మస్ట్ ఎంటర్ టైన్మెంట్ ఉండనుంది. ఎందుకంటే ఇప్పటికే నాని హిట్-3 ది థర్డ్ కేస్, మోహన్ లాల్ తుడ్‌రుమ్ సినిమాలో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీంతో పాటు ఈ వారం మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. మేడే కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మొదట మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో ఓ మోస్తరుగా కలెక్షన్లు వచ్చినా తెలుగులో ఈ మూవీకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీనికి తోడు పోటీగా నిలిచిన సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ యాక్షన్ థ్రిల్లర్ కు నామమాత్రపు స్పందన వచ్చింది. హీరో, హీరోయిన్ల అభినయం, అబ్బుర పరిచే యాక్షన్ సీక్వెన్సులు మాత్రం ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. అలాగే అంతర్లీనంగా ప్రేమ కథ కూడా ఉండడంతో మూవీ లవర్స్ కు ఈ చిత్రం బాగా నచ్చేసింది. తమిళంలో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఓవరాల్ గా రూ. 235 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.