పాదాలు నొప్పిగా ఉన్నాయా? ఇలా చేస్తే నొప్పి పరార్

www.mannamweb.com


పాదాలలో ఏదైనా భాగంలో నొప్పి ఉంటే నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక మడమ నొప్పి ఉన్నప్పుడు నేలపై అడుగు పెట్టడం కూడా కష్టంగా మారుతుంది. స్థూలకాయం, పాదాలకు గాయం అవడం వంటి వివిధ కారణాల వల్ల మడమలో నొప్పి వస్తుంటుంది. మీరు కూడా మడమ నొప్పితో బాధపడుతున్నారా? ఈ నొప్పి నుంచి రిలీఫ్ పొందాలనుకుంటున్నారా? ఎక్కువగా శ్రమ లేకుండానే.. కేవలం హోమ్ రెమిడీస్‌తోనే మడమ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

మడమ నొప్పి నివారణకు ఏం చేయాలంటే..

మడమ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి.. వెల్లుల్లిని ఆవాల నూనెలో వేసి ఉడికించాలి. ఆ తరువాత నూనె కాస్త చల్లారే వరకు ఉంచాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు నూనెతో మడమల మీద అప్లై చేయాలి. నూనెతో మడమలపై సరిగ్గా మజాస్ చేయాలి. ఆవనూనె, వెల్లుల్లి ప్రభావంతో మడమ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ నూనెతో రోజుకు 2, 3 సార్లు మసాజ్ చేస్తే ప్రయోజనం ఉంటుంది.

ఈ చిట్కాలు కూడా..

1. మడమ నొప్పి నుంచి తక్షణం ఉపశమనొ పొందడానికి మరికొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. ఐస్‌ను కూడా అప్లై చేయొచ్చు. ఒక క్లాత్‌లో మంచు ముక్కను కట్టి.. ఆ క్లాత్‌ను మడమపై అప్లై చేయాలి. మసాజ్ మాదిరిగా చేస్తే నొప్పి నుంచి తక్షణం ఉపశమనం కలుగుతుంది. 5 నుంచి 15 నిమిషాలు మంచు ముక్కతో మసాజ్ చేయడం వలన నొప్పి తగ్గుతుంది.

2. సరైన పాదరక్షలు: చాలా సందర్భాల్లో సరైన పాదరక్షలు ధరించకపోవడం వల్ల కూడా మడమ నొప్పి వస్తుంది. సరైన బూట్లు, చెప్పులు ధరించకపోతే నొప్పి వస్తుంది. అందుకే.. మీ కాళ్లకు సరిపడా, నాణ్యమైన చెప్పులు, బూట్లు ధరించాలి.

3. వ్యాయామం: కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు కూడా చేయాలి. తద్వారా మడమ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. కాళ్లు సాగదీయడం వంటి వ్యాయామాల వల్ల నొప్పి తగ్గుతుంది. మీరు పడుకున్నప్పుడు కూడా స్ట్రెచింగ్ చేయవచ్చు. విటమిన్ డి లోపం వల్ల కూడా మడమ నొప్పి వస్తుంది. అలాంటి పరిస్థితిలో విటమిన్ డి అధికంగా ఉన్న వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. ఆహారంలో పాలు, పుట్టగొడుగులు, గుడ్లు ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ తగినంత సూర్యకాంతికి నిల్చోవాలి. తద్వారా విటమిన్ డి లోపం తగ్గిపోతుంది.

4. అల్లం: యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఒక టబ్‌లోని వేడి నీటిలో తురిమిన అల్లం వేసి.. పాదాలను కనీసం 10 నిమిషాల పాటు ఈ నీటిలో ఉంచాలి. తద్వారా నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలా కాకుండా, అల్లం టీని కూడా తయారు చేసుకుని తాగొచ్చు. అల్లం టీ తాగడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.