డాక్టర్ వింత సృష్టి.. మనుషులకు నొప్పి లేని మరణాన్ని ఇచ్చే మిషన్.. ఓ మహిళ మృతి..

www.mannamweb.com


ఇది టెక్నాలజీ కాలం… కాదు కాదు.. మోడ్రన్‌ టెక్నాలజీ యుగం.. మనిషి తలచుకుంటే.. తయారు చేయలేనిది ఏదీ లేదు.. అన్నీ సాధ్యమే.. ఇలా తయారు చేసిన వాటితో మంచీ..

చెడూ.. రెండూ ఉంటాయి. అయితే.. వాటిని ఏ విధంగా వాడుకోవాలన్నది.. మన చాయిసే.. ఇప్పుడు ఇదంతా ఎందుకు ప్రస్తావిన్చాలిస్ వస్తుంది.. అంటే.. ఈ మోడ్రన్‌ టెక్నాలజీ యుగంలో స్విట్జర్లాండ్‌ డాక్టర్‌ తయారు చేసిన ఓ మిషన్‌ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆశ్చర్యమే కాదు.. ఒక విధంగా భయపెడుతోంది…

అవును… ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు నొప్పిలేకుండా చనిపోవడానికి తయారు చేసిన ఒక మిషన్‌ వ్యవహారం చర్చకు దారి తీస్తోంది. అదేంటి.. బతడానికి మందులు కనిపెట్టడమో.. బతకాలని చెప్పడమో చేయాలి.. కానీ.. ఆత్మహత్య చేసుకోవడానికి ఓ స్పెషల్‌ మిషన్‌ తయారు చేయడమేంటి?.. అనుకోవచ్చు.. ఏం చేస్తాం.. అలా ఉంది కాలం.. అంతా.. టెక్నాలజీ యుగమాయే.. ఈ కాలంలో ఏదైనా సాధ్యమే…మరి..

ఈ మిషన్‌ ద్వారా నొప్పి లేకుండా మనుషులను చంపేస్తుంది.

ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు.. ఈ మిషన్‌లోకి వెళ్లి డోర్‌ క్లోజ్‌ చేసుకుని ఒక బటన్‌ నొక్కుకుంటారు. అంతే.. క్షణాల్లో నైట్రోజన్‌ గ్యాస్‌ రిలీజ్‌ అయి.. ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గిపోతాయి. రెప్పపాటులో మనిషి శరీర కదలికలు క్లిష్టమైన స్థాయికి చేరుకుంటాయి. ఆపై కొన్ని క్షణాల్లోనే మనిషి ప్రాణాలు కోల్పోతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. మెర్సీ కిల్లింగ్‌ అన్నమాట. ఇలా ఆత్మహత్య చేసుకునేవారు.. చేసుకోవాలి.. అనుకునేవారు.. ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఇలాంటి వాటికి పలు దేశాల్లో అనుమతులు లేకున్నా.. స్విట్టర్జాండ్‌ మాత్రం పూర్తి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. నొప్పి లేకుండా మనుషులను చంపేసే సూసైడ్‌ మిషన్లను స్విట్జర్లాండ్‌ చట్టబద్ధం చేసింది. ఈ సూసైడ్‌ క్యాప్సూల్‌ తయారీలో డాక్టర్‌ డెత్‌గా పేరొందిన ఫిలిప్‌ నిట్‌స్కే అనే డాక్టర్‌ కీలక పాత్ర పోషించాడు.

తాజాగా.. అమెరికాకు చెందిన ఓ మహిళ ఈ శవపేటిక యంత్రం ద్వారా స్విట్జర్లాండ్‌లోని అటవీ ప్రాంతంలో ఓ ఇంటిలో ప్రాణాలు తీసుకోవడం చర్చనీయాంశం అయింది. అయితే.. ఆమె చనిపోయేందుకు వాడిన మిషన్‌కు చట్టబద్దత లేకపోవడం.. కొందరు సహకరించారనే అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు స్విట్జర్లాండ్‌ పోలీసులు.