నేటి డిజిటల్ యుగంలో ఒక్క క్షణ ఇంటర్నెట్ లేకున్నా అంతా ఆగమాగమవుతుంది. చాలా మందికి నెట్ లేకపోతే ఏం తూచదు. ఈ క్రమంలో మొబైల్ డేటా ఒక అత్యవసరమైనదిగా మారింది.
అయితే చాలామంది యూజర్స్ తమ మొబైల్ డేటా త్వరగా అయిపోతుందని అంటుంటారు. అధిక ధరలతో డేటా ప్లాన్‌లు కొనుగోలు చేసినా, రోజంతా ఇంటర్నెట్ సరిగా పనిచేయక చిరాకు పడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా, కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా మీ మొబైల్ డేటాను సమర్థవంతంగా ఆదా చేసుకోవచ్చు.
డేటా ఆదాకు 5 ముఖ్యమైన చిట్కాలు
యాప్‌ల ఆటో-అప్‌డేట్‌ను నిలిపివేయండి
చాలా స్మార్ట్‌ఫోన్‌లలో యాప్‌లు ఆటో-అప్‌డేట్ మోడ్‌లో ఉంటాయి. దీని వల్ల గూగుల్ ప్లే స్టోర్‌లో అప్‌డేట్‌లు వచ్చిన వెంటనే, యాప్‌లు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవ్వడం మొదలుపెట్టి, భారీగా డేటాను వినియోగిస్తాయి. దీన్ని వెంటనే ఆఫ్ చేసుకోండి. దీన్ని ఆపడానికి.. గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి. మీ ప్రొఫైల్ చిత్రంపై క్లిక్ చేయండి.సెట్టింగ్స్ లోకి వెళ్లి.. నెట్‌వర్క్ ప్రిఫరెన్సెస్ లేదా ఆటో-అప్‌డేట్ యాప్స్ ఎంచుకోండి. అక్కడ, డోంట్ ఆటో-అప్‌డేట్ యాప్స్ లేదా ఆటో-అప్‌డేట్ యాప్స్ ఓవర్ వై-ఫై ఓన్లీ ఎంచుకోండి.
డేటా సేవర్ మోడ్‌ను ఆన్ చేయండి
ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తున్న యాప్‌ల డేటా వినియోగాన్ని పరిమితం చేస్తుంది. దీనిని సెట్ చేసుకోవడానికి మొబైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. నెట్‌వర్క్ & ఇంటర్నెట్ లేదా కనెక్షన్స్ ఎంచుకోండి. డేటా యూసేజ్‌లోకి వెళ్లి, డేటా సేవర్ ఆన్ చేయండి.
వీడియో స్ట్రీమింగ్ క్వాలిటీ తగ్గించండి
యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో హై-క్వాలిటీ వీడియోలను చూడటం వల్ల డేటా వేగంగా ఖర్చవుతుంది. డేటాను ఆదా చేసుకోవాలంటే వీడియో నాణ్యతను తగ్గించుకోండి.యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ యాప్‌లలోని సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. వీడియో క్వాలిటీ 480p లేదా అంతకంటే తక్కువకు సెట్ చేయండి. కొన్ని యాప్‌లలో డేటా సేవర్ మోడ్ కూడా ఉంటుంది.
మొబైల్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను నియంత్రించండి
మొబైల్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు పెద్ద మొత్తంలో డేటాను వినియోగిస్తాయి. సాఫ్ట్‌వేర్ ఆటో అప్‌డేట్ మోడ్‌లో ఉంటే దాన్ని ఆఫ్ చేయండి. దీన్ని కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లేదా సిస్టమ్ అప్‌డేట్ ఎంపికను ఎంచుకోండి. ఆటో-డౌన్‌లోడ్ లేదా ఆటో-అప్‌డేట్ ఎంపికను ఆఫ్ చేయండి. అవసరమైనప్పుడు వై-ఫైలో మాత్రమే అప్‌డేట్ చేయండి.
డేటా లిమిట్‌ను సెట్ చేయండి
రోజువారీ లేదా నెలవారీ డేటా వినియోగాన్ని నియంత్రించడానికి డేటా పరిమితిని సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి, కనెక్షన్స్ లేదా నెట్‌వర్క్ & ఇంటర్నెట్ ఎంచుకోండి. డేటా యూసేజ్‌లోకి వెళ్లి, డేటా వార్నింగ్ లేదా డేటా లిమిట్ సెట్ చేయండి. ఇది మీరు సెట్ చేసిన లిమిట్ దాటితే హెచ్చరిక ఇస్తుంది లేదా డేటాను ఆపివేస్తుంది.
ఈ ఐదు సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా మీ మొబైల్ డేటాను ఆదా చేసుకోవడమే కాకుండా రోజు మొత్తం ఇంటర్నెట్ సేవలను హాయిగా ఉపయోగించుకోవచ్చు.
































