ఉద్యోగంలో చేరాక మన జీవితంలో సగానికి పైగా ఆఫీసులోనే ఉంటాం. అక్కడ మంచి పేరు సంపాదించుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ ఆ పేరును పోగొట్టుకోవడానికి కొన్ని నిమిషాలు చాలు. అందుకే ఆఫీసులో మనం మాట్లాడే మాటలు, మన ప్రవర్తన చాలా ముఖ్యం.
జాబ్‌లో చేరగానే మన రోజులో సగం కంటే ఎక్కువ టైం ఆఫీసులోనే గడుపుతాం. కొన్ని రోజులు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఆఫీసు వాతావరణం సపోర్ట్ ఇచ్చేలా.. ఎదుగుదలకు హెల్ప్ చేసేలా ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు మెంటల్‌గా స్ట్రెస్ కూడా ఇస్తుంది. మీరు ఆఫీసులో ఎలా ఉండాలో పూర్తిగా మీ కంట్రోల్ లో లేకపోయినా.. మీరు చెప్పే మాటలు, ప్రవర్తన బట్టి ఇతరులు మిమ్మల్ని ఎలా చూడాలో డిసైడ్ చేస్తారు. మంచి పేరు సంపాదించుకోవడానికి ఏళ్ళు పట్టొచ్చు.. కానీ దాన్ని పోగొట్టుకోవడానికి కొన్ని నిమిషాలు చాలు. అందుకే ఏదైనా షేర్ చేసే ముందు రెండు సార్లు ఆలోచించాలి. ఇక్కడ మీరు ఆఫీసులో చెప్పకూడని 10 ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పర్సనల్ లైఫ్ డిస్కషన్
వ్యక్తిగత జీవితం అంటే.. అది వేరే వాళ్లకు చెప్పాల్సిన విషయం కాదు. ఆఫీసు జాబ్ కు సంబంధించిన ప్లేస్.. ఎమోషన్స్ పంచుకునే వేదిక కాదు. మీ బ్రేకప్ డీటెయిల్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పంచుకుంటే అవి గాసిప్ లకు అడ్డాగా మారొచ్చు. అందరూ మీ పట్ల సానుభూతి చూపరని గుర్తుంచుకోండి.. చాలా మందికి అది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే.
గాసిప్ లకు దూరం
మీ టీమ్ లీడ్ లేదా పక్కన కూర్చునే కొలీగ్ మీద మీ అభిప్రాయం మీ వరకే ఉండాలి. ఎదుటివాళ్ళ మీద తప్పులు చెప్పడం వల్ల మీ మీద మంచి ఇంప్రెషన్ పడదు. వేరే వాళ్లు మీ గురించి వెనక మాట్లాడితే ఆశ్చర్యపోవద్దు.. మీరు కూడా అదే చేస్తున్నారు కదా. గాసిప్ టెంపరరీగా సరదాగా అనిపించొచ్చు.. కానీ ఎక్కువ కాలం చూస్తే అది మీ పేరును డ్యామేజ్ చేస్తుంది.
జీతం అంటే గోప్యత
మీ శాలరీ మీ పర్సనల్ విషయం. వేరే వాళ్లతో దీన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎంత సంపాదిస్తున్నారో పదే పదే చెబితే.. ఇతరులు అనవసరమైన చర్చలు మొదలుపెడతారు. అలాగే ఇతరులను వాళ్ళ శాలరీ గురించి అడగకూడదు.. ఇది కేవలం అనవసరమైన ఆసక్తి మాత్రమే కాదు.. అపార్థాలకు, అసూయలకు దారి తీయవచ్చు.
మీ కెరీర్ ప్లాన్స్ సీక్రెట్ గా ఉంచండి..
మీరు కొత్త జాబ్ కు మారాలని లేదా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తుంటే.. అది మీ పర్సనల్ డెసిషన్. కొలీగ్స్ కు ఇది తెలియాల్సిన అవసరం లేదు. పని పూర్తిగా సెట్ అయిన తర్వాతే డెసిషన్ తీసుకోండి. అంతేకాదు ఇతరులను వాళ్ళ కెరీర్ ప్లాన్స్ పంచుకోమని ఎంకరేజ్ చేయకండి.
మీ అసంతృప్తిని పనితో చూపించండి
మీ పని మీద అసంతృప్తి ఉండొచ్చు.. కానీ దాన్ని అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం ఉందంటే.. ఎవరితో సంబంధం ఉందో వాళ్ళతో నేరుగా మాట్లాడండి. ప్రతి విషయాన్ని వేరే వాళ్ళ దగ్గర కంప్లైంట్ చేసినట్లు చెబితే.. వాళ్ళు మిమ్మల్ని నెగటివ్ పర్సన్ గా చూడటం మొదలుపెడతారు.
సోషల్ మీడియాతో జాగ్రత్త
హెచ్ ఆర్ లేదా కొలీగ్స్ పంపే ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడం అంటే.. మీరు మీ పర్సనల్ లైఫ్ ను వాళ్లకు చూపిస్తున్నట్లే. అలాంటి సందర్భాల్లో మీ పోస్ట్ లు ఎవరు చూస్తున్నారో జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకవేళ మీరు లీవ్ తీసుకుని ట్రిప్ కు వెళ్లి ఉంటే.. ఆ ఫోటోలు పోస్ట్ చేయడంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.
వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు
ఎందుకు ఎప్పటికప్పుడు మీ విషయాలు పంచుకోవాలి..? కొందరు ఆ సమాచారాన్ని మీకు వ్యతిరేకంగా వాడొచ్చు. మీరు ఇతరుల అనుభవాలను అర్థం చేసుకుంటూ ఉండటం మంచిది. కానీ మీ సమాచారం అందరితో పంచుకోవడం అవసరం లేదు.
ఆఫీసులో పాలిటిక్స్ వద్దు..
ఆఫీసులో పాలిటిక్స్ వద్దు.. ప్రతి ఒక్కరికీ తమ వ్యక్తిగత అభిప్రాయాలుంటాయి.. వాటిని గౌరవించాలి. ఇలాంటి చర్చలు మొదలుపెడితే అనవసరమైన గొడవలు, ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ ఎవరైనా మీ అభిప్రాయంతో విభేదించినా.. దానికి వెంటనే స్పందించకుండా మౌనంగా ఉండటమే ఉత్తమం.
సైలెంట్ సక్సెస్
మీరు సాయంత్రాల్లో ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా, సైడ్ ప్రాజెక్టులు చేస్తున్నా.. అది మీ పర్సనల్ డెవలప్‌మెంట్ కోసమే. కానీ కొలీగ్స్ కు తెలిసిపోతే.. మీ రూల్స్ విషయంలో ఇబ్బందులు రావొచ్చు. కాబట్టి మీ జాబ్ టైమ్ ను గౌరవించి మిగతా టైమ్ ను మీ ఇష్టాలకు వాడుకోండి.
సీక్రెట్ ఇన్ఫర్మేషన్
ఎవరైనా మిమ్మల్ని నమ్మి చెప్పిన విషయాలను వేరే వాళ్లతో చెప్పడం అస్సలు మంచిది కాదు. సీక్రెట్ గా ఉంచాల్సిన వాటిని అందరిలోనూ చెబితే.. అది ఒకరి చెవిలో చెప్పిన మాట గది నిండా మారుమోగినట్టు అవుతుంది. దాని వల్ల వచ్చే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి.
ఆఫీసు కేవలం పని చేసే చోటు మాత్రమే కాదు. అది మన వ్యక్తిత్వాన్ని కూడా చూపించే ప్రదేశం. మీరు మాట్లాడే మాటలు, మీ ప్రవర్తన, మీరు పంచుకునే విషయాలు.. ఇవన్నీ ఎదుటివారిపై మీ ప్రభావాన్ని నిర్ణయిస్తాయి. అందుకే ప్రొఫెషనల్ పరిమితులు పాటిస్తూ.. మీ వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుకోండి. ఇది మీ మానసిక ప్రశాంతతకు చాలా అవసరం.
































