పండగల సీజన్ నడుస్తోంది. వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇక దసరాలు, దీపావళి సంబరాలు త్వరలో మొదలుకానున్నాయి. ఈ పండగలను ఉత్సాహంగా జరుపుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పండగల సందర్బంగా కొత్త వస్తువులను కొనుగోలు చేయడం మనకు ఆనవాయితీ. ఈ సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లో వివిధ వస్తువులపై భారీ తగ్గింపులు అందిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ కంపెనీల స్మార్ట్ ఫోన్లు అత్యంత తగ్గింపు ధరకు అందుబాటులోకి తీసుకురానున్నారు. త్వరలో ప్రారంభం కానున్న పండగ సేల్ లో రూ.15 వేల లోపు ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్ల గురించి సెర్చ్ చేసేవారు ఎక్కువగా ఉంటారు. అన్ని ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ కావాలంటే ఈ రోజుల్లో సుమారు రూ.20 వేలకు పైనే ఖర్చు పెట్టాలి. అయితే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల పండగ సేల్ లో ప్రముఖ కంపెనీల 5 జీ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. కేవలం రూ.15 వేల కంటే తక్కువ ధరకే వాటిని సొంతం చేసుకోవచ్చు. పనితనం, నాణ్యత, ఫీచర్లతో అన్ని విధాలా ఎంతో మెరుగ్గా ఈ ఫోన్లు పనిచేస్తాయి. కొత్తగా ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి, తక్కువ ధరకు మంచి ఫోన్ సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం.
ఐక్యూ జెడ్ 9 లైట్ 5జీ
ఐక్యూ జెడ్ 9 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో అత్యంత తక్కువ ధరకు లభించనుంది. కేవలం రూ.9,499కే ఈ ఫోన్ 128 జీబీ వేరియంట్ అందులోకి రానుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6.56 అంగుళాల డిస్ ప్లే తో ఈ ఫోన్ పనితీరు చాలా బాగుంటుంది.
టెక్నో పోవా 6 నియో
టెక్నో పోవా 6 నియో స్మార్ట్ ఫోన్ పండగ సేల్ లో భారీ తగ్గింపు ధరతో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీనిలో 5000 ఏఎంహెచ్ బ్యాటరీ, వెనుక 108 ఎంపీ కెమెరా ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ లోని 8 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 15,999. కానీ పండగ సేల్ లో కేవలం రూ.12,749కి కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.
హెచ్ ఎండీ క్రైస్ట్ మ్యాక్స్ 5 జీ
తక్కువ ధరకు మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఈ ఫోన్ లో 6.67 అంగుళాల డిస్ ప్లే, వెనుక 50 ఎంపీ సెన్సార్లు, 33 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. హెచ్ ఎండీ క్రైస్ట్ మ్యాక్స్ 5 జీ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.11,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.
సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్05
ప్రముఖ కంపెనీ సామ్సంగ్ విడుదల చేసిన అత్యంత తగ్గింపు ధరలో లభించే ఫోన్ ఇది. దీనిలో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ లో కేవలం రూ.6,499కి అందుబాటులో ఉంటుంది.