వర్షాకాలంలో ఆరెంజ్‌ జ్యూస్‌ తాగుతున్నారా? అయితే, ఈ విషయం తెలుసుకోండి..

www.mannamweb.com


ఆరెంజ్ జ్యూస్‍లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. శ్వాసకోశ ఇబ్బందులను కూడా తగ్గించగలదు. ఇన్‍ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే వానాకాలంలో ఆరెంజ్ జ్యూస్ రెగ్యులర్‌గా తాగడం మంచిది.

నారింజ జ్యూస్‍లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కణాలను ర్యాడికల్ డ్యామేజ్ నుంచి ఇవి సంరక్షిస్తాయి. గుండె వ్యాధులు లాంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే రిస్క్‌ను నారింజ తగ్గించగలదు.

ఆరెంజ్‌లో పొటాషియం, ఫోలేట్ అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించేందుకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు గుండె సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ఇవే కాకుండా ఇందులో శరీరానికి కావాల్సిన ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. ఆరెంజ్ రసంలో ఫ్లేవోన్స్ అధికంగా ఉంటాయి. ఇది మెదడు పనితీరును మెరుగుపరచగలవు. జ్ఞాపకశక్తిని కూడా ఎక్కువ చేయగలదు.

నారింజలోని విటమిన్ సీ శరీరంలో కొలేజెన్ ఉత్పత్తిని పెంచగలదు. చర్మ ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. ఎముకలు, కండరాల దృఢత్వాన్ని కూడా మెరుగుపరచగలదు. ఆరెంజ్ జ్యూస్‍లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో జీర్ణవ్యవస్థకు ఇది మేలు చేస్తుంది. ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు ఈ జ్యూస్ సహకరిస్తుంది. బరువు తగ్గేందుకు కూడా తోడ్పడుతుంది.

ఆరెంజ్‌ జ్యూస్‌లో అధిక మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. దీంతో పాటు చర్మంపై ఉన్న ముడతలు, మచ్చలు సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా చర్మం కూడా మెరిసేలా అందంగా కనిపిస్తుంది.

ఆరెంజ్‌ జ్యూస్‌లో ఉండే అధిక ఫైబర్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీని కారణంగా మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా పొట్ట నొప్పుల నుంచి విముక్తి కలుగుతుంది.