రోజూ వేడి నీరు తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ పిండుకుని తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
ఇది శరీరంలో ఉండే విషాన్ని తొలగిస్తుంది. ఇది కాలేయానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
రోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండడమేకాకుండా జీవక్రియ వేగవంతం అవుతుంది. అంతేకాదు బరువును తగ్గించడంలో ఎంతోబాగా సహాయపడుతుంది. అలాగే ఉదయాన్నే వేడినీళ్లు తాగడం వల్ల మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు దరిచేరవు.
రోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇది చర్మంలోని టాక్సిన్స్, మురికిని తొలగిస్తుంది. వేడి నీటిని తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా చర్మ సమస్యలు కూడా దూరం అవుతాయి. అంతే కాకుండా చర్మం పొడిబారకుండా చేసి హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.
వేడి నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు కరిగిపోతుంది. బరువు అదుపులో ఉండడమే కాకుండా జీవక్రియను వేగవంతం చేస్తుంది. స్నానానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.