తెలంగాణలో మరోసారి భూకంపం.. భయాందోళనలో ప్రజలు

www.mannamweb.com


మహబూబ్ నగర్ జల్లాలో మరోసారి భూప్రకంపనలు వచ్చాయి. కౌకుంట్ల మండలం దాసరి పల్లి సమీలో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదైంది.
మధ్యాహ్నం 12.15 గంటలకు భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇటీవల తెలంగాణలోని గోదావరి బెల్ట్ మొత్తం 5.3 తీవ్రతతో కంపించిన విషయం తెలిసిందే.

భూమి లోపల సుమారు 10 కి.మీ లోతున భూకంపం వచ్చినట్లుగా నేషనల్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. అయితే, ఈ హఠాత్పరిణామంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సరిగ్గా మూడు రోజు క్రితం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భూకంపం సంభవించింది. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూకంపం సంభవించగా.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రగా 5.3గా నమోదైంది. దాదాపు 20 ఏళ్ల తరువాత తెలంగాణలో భూకంపం సంభవించడం ఆందోళన కలిగించింది.