వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన ప్రజలు

: ఓవైపు భారీ వర్షాలు.. మరోవైపు భూ ప్రకంపనలతో తెలంగాణ ప్రజలు వణికిపోతున్నారు. గురువారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో హడలిపోయారు.


ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంత ప్రజల్లో ఇంకా టెన్షన్ కొనసాగుతోంది. ఇంతకీ ఎక్కడ అన్న వివరాల్లోకి వెళ్లొద్దాం.

తెలంగాణలో గురువారం ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా పరిగి పరిసర ప్రాంతాల్లో ఈ ఉదయం కొద్ది సెకన్ల సేపు భూమి కంపించింది. ఉన్నట్లుండి భూమి కాస్త షేక్ కావడంతో ప్రజలు కంగారుపడ్డారు.

రెండుమూడు సార్లు అదే కంటిన్యూ కావడంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. రంగాపూర్, బసినపల్లి, న్యామత్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మళ్లీ భూప్రకంపనలు వస్తాయని భయంతో ఇంకా ప్రజలు రెండుగంటలపాటు బయట ఉన్నట్లు తెలుస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.