చాలా కొద్ది మందికి తెలిసే మాంగోస్టీన్ ఫ్రూట్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అత్యంత అరుదుగా కనిపించే ఈ పండును కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫొటోలో కనిపిస్తోన్న ఈ పండు పేరు మాంగోస్టీన్. చాలా తక్కువ మందికి తెలిసే ఈ పండుతో ఎన్నో లాభాలు ఉన్నాయని మీకు తెలుసా.? కొద్దిగా తీపి, పుల్లగా ఉండే ఈ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ పండుతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* మాంగోస్టీన్ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపులో మంటను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్, గుండెజబ్బులు, మధుమేహం వంటి సమస్యలను దూరం చేయడంలో ఈ పండు కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.
* మాంగోస్టీన్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులోకి యాంటీఆక్సిడెంట్స్ కారణంగా వ్యాధుల బారిన తక్కువగా పడుతుంటారు.
* గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో మాంగోస్టీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మంచి కొలెస్టాల్ పెరగడంతో దోహదపడుతుంది.
* మాంగోస్టీన్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
* చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఈ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఏంజింగ్ ఎలిమెంట్స్‌లా పనిచేస్తాయి.
* డయాబెటిస్ బాధితులకు కూడా ఈ పండు సహాయపడుతుంది. ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కూడా అదుపులో ఉంటుంది. ఫైబర్ కంటెంట్ కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు సూపర్‌ఫ్రూట్‌గా చేస్తాయి.
* మాంగోస్టీన్‌లోని మంచి గుణాలు మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఒత్తిడిని దూరం చేయడంలో ఈ పండు ఎంతో ఉపయోగపడుతుంది. మూడ్ స్వింగ్స్ సమస్యను అధిగమించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.