ప్రతిరోజూ పటిక బెల్లం తింటే ఎన్ని లాభాలో తెలుసా

www.mannamweb.com


పటిక బెల్లం అంటే దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఎక్కువగా దేవుడికి ప్రసాదంగా పెడతారు. ఇది తెల్లగా ఉంటుంది. పటిక బెల్లం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.

ఇది తెల్లగా ఉన్నా కూడా పంచదారలో ఉండే షుగర్ లెవల్స్‌ కంటే చాలా తక్కువగా ఉంటాయి. ఇది తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువగా దేవుళ్లకు ప్రసాదంగా పెడుతూ ఉంటారు. అలాగే చిన్న పిల్లలకు కూడా పటిక బెల్లాన్ని ఆహారంగా ఇస్తూ ఉంటారు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఈ బెల్లాన్ని తరచుగా చిన్న ముక్క తినడం వల్ల పలు రోగాలను నయం చేసుకోవచ్చు. పటిక బెల్లం తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. తరచూ చిన్న ముక్క తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. మరి దీన్ని తినడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

పటిక బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. కాబట్టి ఈ బెల్లాన్ని తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ అనేది బలంగా తయారవుతుంది. వ్యాధులతో పోరాడే శక్తి మీకు లభిస్తుంది. సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు నుంచి కూడా మీకు ఉపశమనం కలుగుతుంది.

తక్షణమే శక్తి వస్తుంది:

పటిక బెల్లం తినడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. నీరసంగా ఉండే వారు పటిక బెల్లం కలిపిన నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటు మరింత ఎనర్జిటిక్‌గా ఉంటారు. శరీరానికి కూడా చలువ చేస్తుంది.

రక్త హీనత సమస్య ఉండదు:

పటిక బెల్లంలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి తరచూ ఇది తినడం వల్ల రక్త హీనత సమస్య నుంచి బయట పడొచ్చు. దీన్ని పొడిలా చేసి పిల్లలకు ఇస్తే.. వారు బలంగా ఉంటారు. అంతే కాకుండా మహిళలు కూడా తరచూ తీసుకుంటే.. పీరియడ్స్‌లో వచ్చే సమస్యలు తగ్గుతాయి. రక్త హీనత సమ్య కూడా తగ్గుతుంది.

ఎముకలు బలంగా:

పటిక బెల్లంలో క్యాల్షియం కూడా మెండుగా లభిస్తుంది. కాబట్టి ఇది తీసుకోవడం వల్ల కీళ్లు, నడుము నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. ఎముకలు కూడా బలంగా, దృఢంగా మారతాయి. పిల్లలకు పెట్టడం చాలా మంచిది.

చర్మం ఆరోగ్యంగా:

పటిక బెల్లం తినడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. తరచూ పటిక బెల్లం తింటే వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. ముడతలు త్వరగా పడకుండా కాపాడుతుంది. చర్మాన్ని కూడా మెరిచేలా చేస్తుంది. మీరు ఈ పొడిని ఫేస్ ప్యాక్స్‌లో ఉపయోగించవచ్చు. అయితే ఇది మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. లేదంటే షుగర్ లెవల్స్ పెరిగి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )