కొబ్బరి, కొబ్బరి నీళ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు దాదాపు అందరికీ తెలిసిందే. కొబ్బరి నీళ్ళు తాగి కొబ్బరిని తింటుంటాము. అయితే, ఇటీవలి కాలంలో మార్కెట్లలో ప్రత్యేకంగా కొబ్బరి పువ్వులు కూడా అమ్ముతున్నారు. ప్రజలు కూడా వీటిని ఎగబడి కొంటున్నారు. అయితే, కొబ్బరి పువ్వు ఆరోగ్యప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కొబ్బరి పువ్వులో కూడా పుష్కలమైన ప్రయోజనాలను కలిగి ఉంది. ఇందులో డైటరీ ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, కరిగే చక్కెరలు కూడా ఉన్నాయి. కొబ్బరి పువ్వు తినడం వల్ల అలసట, నీరసం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
కొబ్బరి పువ్వులో ఉండే యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ పరాన్నజీవి వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరి పువ్వు మధుమేహంతో సంబంధం ఉన్న లక్షణాలను మెరుగుపరచడం ద్వారా మధుమేహాన్ని నివారిస్తుంది. కొబ్బరి పువ్వు ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడం ద్వారా క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
కొబ్బరి పువ్వు కొలెస్ట్రాల్‌ను మెరుగుపరుస్తుంది, గుండె జబ్బులను నివారిస్తుంది. కొబ్బరి పువ్వు థైరాయిడ్‌ను నివారించడంలో సహాయపడుతుంది. కొబ్బరి పువ్వు జుట్టును బలంగానూ, నల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. కొబ్బరి పువ్వు చర్మం డతలు, చిన్న మచ్చలు, నల్ల మచ్చలను నివారిస్తుంది, సూర్యరశ్మి నుంచి రక్షణ కల్పిస్తుంది.
కొబ్బరి పువ్వు తినడం మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి సహాయపడుతుంది. కొబ్బరి పువ్వు మూత్రపిండాలు, మూత్రాశయ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. కొబ్బరి హార్మోన్ బ్యాలెన్సింగ్ ప్రయోజనాలు అందిస్తుంది. ఇందులోని కొవ్వు ఆమ్లాలు ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్‌లను తొలగించడంలో సహాయపడతాయి, హార్మోన్ల సమతుల్యత చెక్కుచెదరకుండా ఉంటుంది.
కొబ్బరి పువ్వు తినడం వల్ల ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహం వ్యాధితో బాధ పడుతున్న వారు కొబ్బరి పువ్వు దొరికినప్పుడు.. దాన్ని మిస్ చేసుకోకుండా తీసుకోవాలి. అంతేకాదు కొబ్బరి పువ్వు తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. కొబ్బరి పువ్వులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. దీంతో బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది.