Dry Fruits : డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. అయితే ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

www.mannamweb.com


Dry Fruits : డ్రై ఫ్రూట్స్ తింటున్నారా.. అయితే ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

Dry Fruits : న‌ట్స్‌, సీడ్స్‌తోపాటు ఎండిన ఫ్రూట్స్‌ను కూడా డ్రై ఫ్రూట్స్ అంటారు. వీటిని తింటే మ‌న‌కు శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది. వీటిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు ల‌భిస్తాయి. ఇవి మ‌న‌ల్ని రోగాలు రాకుండా చూస్తాయి. అయితే చాలా మంది డ్రై ఫ్రూట్స్‌ను తిన‌డంలో అనేక త‌ప్పుల‌ను చేస్తుంటారు. అలాగే వాటిని నిల్వ చేయ‌డంలోనూ త‌ప్పులు చేస్తుంటారు. ఇవి చేయ‌కూడ‌దు. ఇక ఆ త‌ప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

డ్రై ఫ్రూట్స్ ఏవి అయినా స‌రే నీటిలో నాన‌బెట్టే తినాలి. కొన్నింటిని 4 నుంచి 8 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. ఇంకాస్త గ‌ట్టిగా ఉన్న‌వాటిని ఇంకా ఎక్కువ స‌మ‌యం పాటు నాన‌బెట్టాలి. నాన‌బెట్టకుండా డ్రై ఫ్రూట్స్‌ను తింటే అవి స‌రిగ్గా జీర్ణం కావు. దీంతో వాటిల్లో ఉండే పోష‌కాల‌ను మ‌న శ‌రీరం స‌రిగ్గా శోషించుకోలేదు. ఫ‌లితంగా వాటిని తిని కూడా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. అలాగే డ్రై ఫ్రూట్స్‌ను నాన‌బెట్ట‌కుండా నేరుగా తింటే వాటిల్లో ఉండే కొవ్వుల కార‌ణంగా కొంద‌రికి వాంతికి వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. అలాగే కొంద‌రికి అల‌ర్జీలు కూడా వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక డ్రై ఫ్రూట్స్‌ను ఎల్ల‌ప్పుడూ నాన‌బెట్టి తినాలి.

ఇక కొంద‌రు డ్రై ఫ్రూట్స్‌ను గాలికి బ‌య‌ట అలాగే ఉంచుతారు. ఇలా ఉంచ‌డం వ‌ల్ల అవి గాలితో చ‌ర్య పొందుతాయి. దీంతో అవి త్వ‌ర‌గా పాడ‌య్యే అవ‌కాశాలు ఉంటాయి. అలాగే వాటిల్లో ఉండే పోష‌కాలు కూడా న‌శిస్తాయి. క‌నుక డ్రై ఫ్రూట్స్‌ను గాలి చొర‌బ‌డ‌ని సీసాలో నిల్వ చేయాలి. వాటిని తిన‌ద‌లిస్తేనే బ‌య‌ట‌కు తీయాలి. అలాగే వాటిని తేమ వాతావ‌ర‌ణంలో కాకుండా పొడి వాతావ‌ర‌ణంలో నిల్వ చేయాలి.

ఇక డ్రై ఫ్రూట్స్‌ను కొంద‌రు పెద్ద మొత్తంలో కొంటారు రోజుల త‌ర‌బ‌డి తింటారు. కానీ ఇలా చేయ‌కూడ‌దు. నెల రోజులకు స‌రిప‌డా డ్రై ఫ్రూట్స్‌ను మాత్ర‌మే కొని వాడాలి. ఎక్కువ కాలం పాటు వాటిని ఉంచితే పాడై పోయే అవ‌కాశాలు ఉంటాయి. అలాగే భారీ మొత్తంలో డ్రై ఫ్రూట్స్‌ను తిన‌కూడ‌దు. కొన్ని కొన్ని తినాలి. రోజూ ఏవైనా రెండు ర‌కాల డ్రై ఫ్రూట్స్‌ను క‌లిపి ఒక గుప్పెడు మోతాదులో తిన‌వ‌చ్చు. అంత‌క‌న్నా ఎక్కువ తిన‌కూడ‌దు. ఇలా డ్రై ఫ్రూట్స్ విష‌యంలో జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది.