మామిడి పండ్లు తినడం వల్ల ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది.

మామిడిపండును కాల్షియం కార్బైడ్ వంటి హానికరమైన రసాయనాలతో కృత్రిమంగా పండిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలతోపాటు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


కాల్షియం కార్బైడ్ అనేది మామిడిపండ్లను వేగంగా పండించడానికి అక్రమంగా ఉపయోగించే ఒక రసాయనం. ఇది నీటితో కలిసినప్పుడు ఎసిటిలిన్ వాయువును విడుదల చేస్తుంది. ఈ ఎసిటిలిన్ వాయువులో తరచుగా ఆర్సెనిక్, ఫాస్ఫరస్ హైడ్రైడ్‌లు వంటి హానికరమైన మలినాలు ఉంటాయి. ఇవి మానవ ఆరోగ్యానికి విషపూరితం.

క్యాన్సర్ ప్రమాదం

కాల్షియం కార్బైడ్ మరియు దానిలోని మలినాలకు దీర్ఘకాలికంగా గురికావడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటివి వస్తాయి. వీటితోపాటు కాల్షియం కార్బైడ్‌తో పండిన పండ్లను తినడం వల్ల అనేక ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాల వంటి జీర్ణ సమస్యలు, తలనొప్పి, మైకం, మానసిక సమస్యలు, నిద్రలేమి, జ్ఞాపకశక్తి కోల్పోవడం, బలహీనత, తిమ్మిర్లు, మూర్ఛ వంటి నరాల సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. గొంతు మంట, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంలాంటి శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి.

చర్మ సమస్యలు

చర్మంపై దద్దుర్లు, పుండ్లు రావడంతోపాటు కొన్ని తీవ్రమైన సందర్భాల్లో గుండె వైఫల్యం, ఇతర ప్రాణాంతక సమస్యలకు కూడా దారితీయవచ్చు. సహజంగా పండ్లు పండటానికి ఎథిలీన్ అనే మొక్కల హార్మోన్ కారణం. కృత్రిమంగా పండించడానికి ఉపయోగించే ఎథిలీన్ గ్యాస్ సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. చాలా దేశాలలో దీనికి అనుమతి ఉంది. కాల్షియం కార్బైడ్‌తో పోలిస్తే ఎథిలీన్ ఆరోగ్య సమస్యలను కలిగించదు.

కృత్రిమంగా పండిన మామిడి పండ్లను గుర్తించడం ఎలా?

రసాయనాలతో పండిన మామిడి పండ్లు ప్రకాశవంతమైన, అసహజమైన పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉంటాయి కానీ లోపల పచ్చిగా ఉండవచ్చు. సహజంగా పండినవి సాధారణంగా ఏకరీతి రంగును కలిగి ఉంటాయి. కృత్రిమంగా పండిన మామిడిపండ్లకు సహజమైన తీపి రుచి ఉండదు. కొన్నిసార్లు రసాయన లేదా వెల్లుల్లి వాసన రావచ్చు. నోట్లో పెట్టినప్పుడు కొద్దిగా మంటగా అనిపించవచ్చు. ఒక బకెట్ నీటిలో మామిడిపండ్లను వేయండి. రసాయనాలతో పండినవి తేలిపోతాయి, సహజంగా పండినవి మునిగిపోతాయి. కాల్షియం కార్బైడ్ వాడిన పండ్లపై నల్లటి మచ్చలు లేదా తెల్లటి పొడి అవశేషాలు ఉండవచ్చు.

ఏం చేయాలంటే

నమ్మకమైన దుకాణాల నుండి లేదా నేరుగా రైతుల నుండి మామిడి పండ్లను కొనుగోలు చేయండి. సహజంగా పండిన పండ్లను ఎంచుకోండి. పండ్లు కొన్న తర్వాత వాటిని బాగా కడిగి, అవసరమైతే ఉప్పు నీటిలో కొంతసేపు నానబెట్టి తినండి. సీజన్‌లో లభించే పండ్లను మాత్రమే తినడానికి ప్రయత్నించండి.ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ వాడకాన్ని భారతదేశంలోFSSAI నిషేధించింది. అయినప్పటికీ ఇది ఇంకా వాడుకలో ఉంది కాబట్టి పండ్లను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.