ఆరెంజ్ ఎప్పుడు పడితే అప్పుడు తింటే మీ ఆరోగ్యం మటాష్.. ఈ టైమ్‌లో తింటేనే ఆరోగ్యానికి మేలు

www.mannamweb.com


చలికాలం ప్రారంభమైంది. ఈ సీజన్‌లో నారింజ పండ్లు (ఆరెంజ్) ఎక్కువగా దొరకుతాయి. రోడ్లపై కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతారు. తినడానికి నోటికి రుచిగా, పుల్లగా.

తియ్యగా ఉంటాయి ఈ పండ్లు. ఇంట్లో చిన్న, పెద్దా తేడా లేకుండా ఆరెంజ్ పండ్లను బాగా ఇష్టంగా తింటారు. వీటితో జ్యూస్ చేసుకుని కూడా తాగుతారు. ఈ సీజన్‌లో దొరికే నారింజ పండ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆరెంజ్‌లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీని ధర కూడా తక్కువే కావడంతో ప్రజలు ఎక్కువగా కొని ఇంటికి తెచ్చుకుంటారు. అయితే, చాలా మందికి ఆరెంజ్ ఫ్రూట్ ఎప్పుడు, ఎలా తినాలో తెలియదు. చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు తిని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చలికాలంలో ఆరెంజ్ ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.

నారింజ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది నిమ్మ, గ్రేప్ ఫ్రూట్, బత్తాయిలానే సిట్రస్ జాతికి చెందిన పండు. ఇందులో విటమిన్ సి, ఐరన్, మెగ్నిషియం, కాల్షియం, ఫైబర్, పొటాషియం, బి6 వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో అనేక వ్యాధుల నుంచి బయటపడతారు. చలికాలంలో సూర్యరశ్మి ఎక్కువగా ఉండదు. దీంతో శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందదు. అదే ఆరెంజ్ తింటే విటమిన్ అందుతుంది. ఈ పండు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది. ఇలా చెప్పుకుంటే పోతే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఈ పండులో ఉన్నాయి.

ఆరెంజ్ లేదా జ్యూస్ ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటే కడుపులో గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే నారింజ పండు తినడానికి సరైన సమయం ఏంటో తెలుసుకోవాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఖాళీ కడుపుతో లేదా రాత్రి పూట ఎప్పుడు నారింజ పండు తినకూడదు. ఖాళీ కడుపులో నారింజ తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే, గ్యాస్ సమస్యల్ని కలిగిస్తుంది. రాత్రి పూట తింటే ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి.

నారింజ తినే టైమ్..

నారింజ పండును మధ్యాహ్నం తినడం మేలు అంటున్నారు నిపుణులు. లేదంటే బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఒక గంట గ్యాప్ ఇచ్చి తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నేరుగా తిన్నా లేదా జ్యూస్ తాగినా శరీరానికి బోలెడు లాభాలు చేకూరతాయి. చలికాలంలో వచ్చే వ్యాధుల్ని తట్టుకునే శక్తి వస్తుంది. ఇమ్యూనిటీ పవర్ రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

చలికాలంలో బెస్ట్..

శీతాకాలంలో నారింజను క్రమం తప్పకుండా తింటే, దాని ప్రభావం 1 వారంలో కనిపిస్తుంది. ఇందులో పీచు పదార్థం చాలా ఎక్కువ. దీని వల్ల నారింజ తిన్న తర్వాత కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఆరెంజ్ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సీజనల్ వ్యాధులు జలుబు, దగ్గు రాకుండా అడ్డుకుంటుంది. అందుకే చలికాలంలో వీటికి డిమాండ్ ఎక్కువ.

ఎక్కువ మాత్రం తినకూడదు..

ఆరెంజ్ ఫ్రూట్స్ మితంగా తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే, ఈ పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే రోజుకు ఒక నారింజ పండు తింటే ఆరోగ్యానికి మేలు అంటున్నారు నిపుణులు.

వీళ్లు తినకూడదు..

సిట్రస్ అలెర్జీ లేదా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆరెంజ్ తినకూడదు. కిడ్నీ, కాలేయ సంబంధిత సమస్యలున్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే ఈ పండ్లను తినాలి. ఎందుకంటే నారింజలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదముంది. సిట్రస్ అలర్జీ ఉన్నవారు కూడా సలహా తీసుకోవాలి. ఇక, బయట తయారుచేసిన ఆరెమజ్ జ్యూస్‌లో అదనపు ఫ్లేవర్లు, చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేయవచ్చు. అందుకే.. బయటి ప్యాక్ చేసిన కమలా జ్యూస్ తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.