సపోటా పండ్లు తింటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..

www.mannamweb.com


సపోటా పండ్లలో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో విటమిన్ A ఎక్కువ మోతాదులో లభిస్తుంది. చర్మం, కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా చేస్తుంది.సపోటా పండ్లలో విటమిన్ C, విటమిన్ B కాంప్లెక్స్, ఖనిజాలు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా రక్తపోటును నియంత్రిస్తాయి.

సపోటాలో కాల్షియం, మాగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు ఇతర ఎముకల సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. అలాగే ఇందులో ఫైబర్, ఫాస్పరస్, కాల్షియం కూడా లభిస్తాయి. వీటిని తినడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

సపోటాలో ఉండే ఫ్రక్టోజ్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అంతేకాదు అలసట, నీరసం వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

సపోటాలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చిన్న పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకంతో బాధపడేవారికి ఈ పండును తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. యాపిల్, ఆరెంజ్ కంటే ఎక్కువగా ఉండే ఈ పండులో విటమిన్ సి ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

సపోటాలోని పొటాషియం రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా గుండెపోటు ఇతర సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుంది. సపోటాలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.

సపోటాలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరుగుపరుస్తాయి. చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గించి చర్మం మృదువుగా మెరిసేలా చేస్తుంది. యాంటీఆక్సిడెంట్, విటమిన్-సి కంటెంట్ ఈ పండులో అధిక మొత్తంలో ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వంటి విషపూరిత మూలకాలతో పోరాడుతుంది. జీవ కణాలకు కలిగే నష్టాన్ని నివారిస్తుంది. ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులను కూడా దూరం చేస్తుంది.