డయాబెటిక్ న్యూరోపతి.. నరాల ఆరోగ్యానికి ఇవి తింటే మేలు

ధుమేహం నరాలపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని సమస్యలను కలిగిస్తుంది. దీనినే డయాబెటిక్ న్యూరోపతి అంటారు. డయాబెటిక్ న్యూరోపతి వల్ల అరికాళ్ళలో మంటలు నొప్పులు, నరాల నొప్పులు కలుగుతాయి.


ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ పరిస్థితిని అదుపులో ఉంచుకోవచ్చు. మీ రోజువారీ ఆహారంలో మార్పులు చేర్చుకోవడం వల్ల మధుమేహంతో బాధపడేవారిలో నరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

డయాబెటిక్ న్యూరోపతి.. ఇవి తింటే మేలు

డయాబెటిక్ న్యూరోపతి తో బాధపడేవారు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. పాలకూర, బచ్చలి కూర, తోటకూర వంటి ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి నరాలు దెబ్బతినకుండా కాపాడతాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు లాంటి పండ్లలో కూడా యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని మీ భోజనంలో చేర్చుకుంటే మంచిది. ఇవి నరాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ఈ ఆహారాలతో నరాల ఆరోగ్యం

గింజలు, విత్తనాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E ఉంటాయి. ఇవి నరాలు సరిగ్గా పనిచేయడానికి తోడ్పడతాయి. వాల్‌నట్స్, బాదం, అవిసె గింజలు నరాల ఆరోగ్యానికి మంచి ఎంపికలు. ఓట్స్, బ్రౌన్ రైస్ లాంటి సంపూర్ణ ధాన్యాలలో పీచు పదార్థం, B విటమిన్లు ఉంటాయి. ఇవి కూడా నరాల ఆరోగ్యానికి చాలా మంచివి.

ఈ ఆహారాలను అసలే మరచిపోవద్హు

నరాల ఆరోగ్యానికి ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చాలా అవసరం. సాల్మన్, మాక్రెల్ లాంటి చేపల్లో ఇవి పుష్కలంగా దొరుకుతాయి. శాకాహారులు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం చియా విత్తనాలు, వాల్‌నట్స్ తీసుకోవచ్చు. విటమిన్ D కూడా ముఖ్యమైన పోషకం. సూర్యరశ్మి ద్వారా శరీరం సహజంగా విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. ఫోర్టిఫైడ్ పాలు, నారింజ రసం వంటి ఆహార పదార్థాల ద్వారా కూడా ఈ విటమిన్‌ను పొందవచ్చు.

వీటిని తీసుకుంటే నరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది

పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది. దీనికి వ్యాధినిరోధక గుణాలు ఉన్నాయని అందరికీ తెలుసు. దీన్ని వంటల్లో వాడటం వల్ల నరాల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అల్లం కూడా ఇలాంటి మంచి గుణాలను కలిగి ఉన్న మరో దివ్య ఔషధం. దేనిని కూడా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల నరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నరాలతో సహా శరీరంలోని అన్ని భాగాల ఆరోగ్యానికి తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం.

నరాల ఆరోగ్య నష్టం చేసే వీటి జోలికి వెళ్లొద్దు

చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉన్న ప్రాసెస్ చేసిన ఆహారాలు నరాల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అందుకే సహజమైన, పూర్తి ఆహారాలను ఎంచుకోవడం మంచిది.ఈ ఆహార మార్పులను పాటించడం వల్ల మధుమేహ రోగులలో నరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే, ఏమైనా ముఖ్యమైన ఆహార మార్పులు చేసే ముందు తప్పకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.