చాలా మందికి నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం. అసలు ముక్క లేనిదే ముద్ద దిగని వారు కూడా ఉంటారు. మాంసాహారంలో ఎక్కువగా ఇష్టంగా తినేది చికెన్. ఇది కూడా కొంచెం తక్కువ ధరలో దొరుకుతుంది కాబట్టి అందరూ చికెన్ తినడానికి ఇష్టపడుతుంటారు.
అయితే అధిక మొత్తంలో చికెన్ తినడం కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమే. అలాగే మితంగా చికెన్ తినాలనుకునే వారు చికెన్‌లో ఓ పార్ట్‌ను ఎట్టిపరిస్థితుల్లో తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
అది తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని, గుండె ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంతకీ చికెన్‌లో ఎలాంటి పార్ట్ తినకూడదు. ఆ పార్ట్ తింటే ఏమవుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి..
లెగ్ పార్ట్..
చికెన్‌లో అందరికీ ఇష్టమైన భాగం ఏదైనా ఉందంటే అది లెగ్ పీస్. ఈ భాగాన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే చికెన్‌లో ఈ పార్ట్‌ను తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే కోళ్ల ఫారాల్లో పెంచే కోళ్లకు రోగాలు రాకుండా ఉండేందుకు సులభంగా వేగంగా బరువు పెరిగేందుకు తొడ భాగంలో ఎక్కువగా ఇంజెక్షన్స్, స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటారు. అందుకే ఈ లెగ్ పీస్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే లెగ్ పీస్‌లో కొవ్వు పదార్ధం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిని తినడం వల్ల.. కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఏం తినాలి?
డైట్ పాటించే వారికి, ప్రతిరోజూ వర్క్‌ఔట్లు చేసే వారికి ప్రోటీన్ ఇన్‌టేక్ అనేది చాలా అవసరం. అలాంటి వారు ముఖ్యంగా చికెన్ మీద ఆధారపడుతుంటారు. ఒకవేళ మీకు కనుక ప్రోటీన్ ఇన్‌టేక్ అవసరముండి, చికెన్ తినాల్సి వస్తే.. ఊర్లలో పెరిగే నాటు కోళ్లను తీసుకోవడం మంచిది. ఇవి సహజంగానే పెరుగుతాయి. అలాగే ఎలాంటి ఇంజెక్షన్స్, స్టెరాయిడ్స్ ఇవ్వరు కాబట్టి ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అదే సమయంలో ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉంటాము.
స్కిన్‌తో తినాలా వద్దా?
ఇప్పటికీ చాలా మందికి చికెన్ స్కిన్‌తో తినాలా? స్కిన్ లేకుండా తినాలా అనే అనుమానం ఉంటుంది. అయితే చికెన్ స్కిన్ లేకుండా తింటేనే బాగుంటుంది. ఎందుకంటే చికెన్ స్కిన్‌లో కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తినడం వల్ల సులువుగా బరువు పెరగడంతో పాటు శరీరంలో చెడు కొవ్వు విపరీతంగా పెరిగిపోతుంది. దీని వల్ల భవిష్యత్తులో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే ఒమేగా 3, ఒమేగా 6, ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉన్న వ్యక్తులు వారానికి ఒకసారి స్కిన్‌తో పాటు చికెన్ తినొచ్చు.
రోజూ చికెన్ తినడం కూడా మంచిది కాదు..
కొందరు ప్రతిరోజూ చికెన్ తింటూ ఉంటారు. ముక్క లేకపోతే వారికి ముద్ద దిగదు. అయితే ప్రతిరోజూ చికెన్ తినడం కూడా అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణం కావడం చాలా లేట్ అవుతుందని అది క్రమంగా జీర్ణ వ్యవస్థ, కిడ్నీలపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. అందుకే నిపుణుల సలహాలతో మితంగా తినాలని సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.