*????️Egypt Pyramids- ఈజిప్టు పిరమిడ్లు – నిర్మాణ కారణం – పిరమిడ్ల నిర్మాణం ఎలా-ప్రపంచపు వింత- గీజా పిరమిడ్…* ????ఆ ప్రాంతం లో గగన తలం నుంచి తీసిన వీడియో…కళ్ళకు కట్టినట్లు పిరమిడ్స్ ను చూపు వీడియోస్ …..

www.mannamweb.com


Egypt Pyramids- ఈజిప్టు పిరమిడ్లు – నిర్మాణ కారణం – పిరమిడ్ల నిర్మాణం ఎలా…?- ఇప్పుడు వివిధ పతనదశల్లో 30వరకు పిరమిడ్లను గుర్తిస్తున్నా పూర్తిరూపంలోఉన్నవి కేవలం 8మాత్రమే-ప్రపంచపు వింత- గీజా పిరమిడ్

ఏసు క్రీస్తు పుట్టి ఇప్పటికి దాదాపు 2000 సంవత్సరాలు అవుతున్నది కదా, అంతకు 2500 సంవత్సరాల ముందు- అంటే ఇప్పటికి దాదాపు నాలుగువేల ఐదువందల సంవత్సరాల క్రితం- ఈజిప్టును “ఫారో”లు పరిపాలించారు.

ఆనాడు “ఫారో” కేవలం రాజు మాత్రమే కాదు- అద్భుత శక్తులకు ఆయన ప్రతీక; భగవంతునితో నేరుగా సంబంధం కలిగి ఉండే మంత్రవేత్త. రాజ్యంలో ఉండే అద్భుత సంపదలన్నిటికీ ఆయనే అధిపతి; ఈ భూమి మీద నడిచేదేవుడు ఫారో. ఆ ఫారోల శరీరం మామూలుది కాదు- దివ్య శరీరమే అది; అందరూ ఎల్లకాలమూ పూజించుకోవలసిన శరీరం అది. అట్లాంటి శరీరం నశించిపోతే, మరి దాన్ని అందరూ పూజించుకునేది ఎలాగ? అందుకని ఆనాటి వైద్యులు ఫారోలు చనిపోయాక, వాళ్ళ శరీరాలను ‘మమ్మిఫై’ చేయటం మొదలుపెట్టారు-

ఫారోల శరీరాల్లోంచి మెదడును, ఇతర పెద్ద అంతర్గత అవయవాలను అన్నింటినీ తీసేసి, ఎంపిక చేసిన రసాయనాలను శరీరంలోపల అంతా కూరేవాళ్ళు. పైన చర్మం పాడవ్వకుండా ఉండేందుకు గాను రకరకాల లేపాలను పూసి, శరీరం మొత్తాన్నీ బట్టతో గట్టిగా చుట్టేసేవాళ్ళు. అట్లా తయారు చేసిన ‘మమ్మీ’ల చర్మం ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా పాడవ్వకపోవటం నిజంగా ఆశ్చర్యం; నాటి వైద్య శాస్త్రపు అద్భుతం! ‘యునానీ’ వైద్యుల గొప్పతనం.

ఈజిప్టు పిరమిడ్లు
ప్రపంచంలో అత్యంత గొప్ప మరియు అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన కట్టడాల్లో ఈజిప్టు పిరమిడ్లు ప్రముఖమయినవి. ప్రాచీన మరియు మధ్య యుగపు ఈజిప్టు నాగరికతలకు ఇవి ప్రతిబింబంగా నిలిచిపోయాయి.

నిర్మాణ కారణం
ఈజిప్టు రాజ వంశానికి చెందినవారు మరణించినపుడు వారికోసం పిరమిడ్లను నిర్మించాలన్న ప్రతిపాదన చేసి అమలు చేసింది ఇంహోటెప్ అనే వాస్తు శిల్పి. అప్పటి వరకు ఉన్న ‘మస్టబా’లను అంచెలంచెలుగా ఒకదాని పైన ఒకటి అమర్చి పైకి వెళ్తున్న కొద్దీ పరిణామము తగ్గుతూ ఒక కొన వద్ద నిర్మాణ ఆగిపోయే విధంగా రూపకల్పన చేసాడు. ఈ నిర్మాణానికే ‘పిరమిడ్’ అని పెట్టబడింది. తర్వాతి కాలంలో ఈజిప్షియన్లు ‘ఇంహోటెప్’ ను దైవసమానుడిగా కొలిచేవారు. పిరమిడ్ల నిర్మాణానికి ఫారో వంశస్థులు రాజ్యమేలుతున్న కాలం స్వర్ణయుగం లాంటిది. అత్యంత గొప్ప పిరమిడ్ అయిన గిజా మరియు మరి కొన్ని అత్యద్భుత పిరమిడ్లు ఫారోల కాలంలో నిర్మింపబడ్డాయి. తదనంతర కాలంలో ఫారోల ప్రాభవం తగ్గుముఖం పట్టడం, పెద్ద పెద్ద నిర్మాణాలకు అవసరమయిన వనరులను చేకూర్చుకోలేక పోవడంతో తక్కువ సాంకేతిక విలువలతో కూడిన చిన్న చిన్న పిరమిడ్లు మాత్రమే కట్టబడ్డాయి.పిరమిడ్ల ఆకృతి గురించి పలు నమ్మకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈజిప్షియన్ల నమ్మకం ప్రకారం: రాత్రి పూట ఆకాశంలో కనపడే దట్టమయిన నల్లని ప్రాంతం భూమికి, స్వర్గానికి మధ్య అడ్డుగోడ వంటిది. పిరమిడ్ చివర సన్నని అంచు సరిగ్గా ఆ దట్టమయిన అడ్డుగోడకు సూచింపబడి ఉంటుంది. పిరమిడ్ మధ్యలో భద్రపరిచి ఉన్న గొప్ప వంశస్థుల మృతదేహం నుండి వారి ఆత్మ పిరమిడ్ ద్వారా ప్రయాణించి సన్నని మొన నుండి బయటకు వచ్చి ఆ అడ్డుగోడను చేదించి స్వర్గంలోకి ప్రవేశించి దేవతలను చేరుకుంటుంది. చనిపోయిన వారికి చిహ్నంగా భావించే సూర్యాస్తమయం జరిగే నైలు నదీ తీరాన అన్ని పిరమిడ్లు నిర్మించబడ్డాయి.

పిరమిడ్ల నిర్మాణం ఎలా…?
ఈజిప్టు పిరమిడ్లు ప్రాచీన ప్రపంచ నాగరికతకు అద్దంపట్టే అత్యంత ప్రాముఖ్యత గల నిర్మాణాలు. సుమారు 850 సంవత్సరాలపాటు 138 పిరమిడ్లను వేర్వేరు ప్రాంతాలలో, వేర్వేరు కాలాలలో నిర్మించారు. మరి భారీ యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ కాలంలో పిరమిడ్లను ఎలా నిర్మించి ఉంటారు? పిరమిడ్ల నిర్మాణంలో వాడిన మోర్టార్‌ (సిమెంటు లాంటి జిగురు పదార్థం) ఏ తరహా రసాయన పదార్థం?ఆ అంశాలను మనమిప్పుడు తెలుసుకుందాం.
కైరో నగరానికి దాదాపు 50కి.మీ.దూరంలో ఉన్న సక్కారా ప్రాంతంలో మొదలయి, దాదాపు 200 కి.మీ.దూరం వరకు విస్తరించిన హవారాప్రాంతం వరకూ వివిధకాలాల్లో ఈ పిరమిడ్లను నిర్మించారు. ఈ 138 పిరమిడ్లలో నేడు చాలా కూలిపోయి నేలమట్టమయ్యాయి. కేవలం పునాదుల అవశేషాల ఆధారంగా, మిగిలిన పిరమిడ్ల నమూనాల కనుగుణంగా లెక్కించి 138పిరమిడ్లుగా గుర్తించారు. ఇప్పుడు వివిధ పతనదశల్లో 30వరకు పిరమిడ్లను గుర్తిస్తున్నా పూర్తిరూపంలోఉన్నవి కేవలం 8మాత్రమే. ఇందులో క్రీ.పూ.2550 సంవత్సరంలో గిజా ప్రాంతంలో నిర్మించిన గ్రేట్‌ పిరమిడ్‌ సుమారు 150మీ.ఎత్తు ఉంటుంది. ఆధునిక ప్రపంచంలో ఉన్న కట్టడా లను పక్కనబెడితే 20వ శతాబ్దాంతం వరకు లెక్కిస్తే మానవనిర్మిత నాగరిక కట్టడాలలో గ్రేట్‌ పిరమిడ్‌ అత్యంత ఎత్తయిన కట్టడం.


పిరమిడ్లు అనేవి ఆనాటి కాలాల్లో ఛాందస భావాలతో ఉన్న పాలకుల సమాధులు. ఈ పాలకుల్ని ఫారోలు అంటారు. ఉదాహరణకు తొలి పిరమిడ్‌ను జోసర్‌ అనే ఫారోకు సమాధిగా కట్టారు. దీనిని సక్కారా ప్రాంతంలో నిర్మించారు. గ్రేట్‌ పిరమిడ్‌ను. క్రీ.పూ.2530 సంవత్సరంలో గిజా ప్రాంతంలో ఖాఫెర్‌ అనే ఫారోకు సమాధిగా నిర్మించారు. చివరి పిరమిడ్‌ను మూడవ అమ్మెన్‌ మాట్‌ సమాధిగా హవారాలో క్రీ.పూ. 1860లో ప్రారంభించి సుమారు 50 సంవత్సరాలకు పూర్తిచేశారు. పిరమిడ్లు అంటేనే గణితం ప్రకారం బహుభుజ ఆధారపీఠం ఉన్న శంఖాకృతులు. అంటే ఆధారపీఠం త్రికోణాకృతితోగానీ, చతురస్రా కారంతో గానీ ఉండడం ఆనవాయితి. పార్శ్వభాగాలు ఆధారపీఠంలోని ప్రతిభుజంనుంచి కూచీగా బయలుదేరి పైభాగాన కూచాగ్రం (అపెక్స్‌) దగ్గర కలుస్తాయి. అంటే ప్రతి పార్శ్వపుగోడ సమ ద్విబాహు త్రిభుజాకృతిలో ఉంటాయన్నమాట. క్రమంగా పైకెళుతున్నకొద్దీ అడ్డుకోత వైశాల్యం తగ్గుతూ ఉండడం వల్ల పైభాగాన ఉన్న బరువ్ఞను కిందభాగంలో ఉన్న ఆధారం స్థిరంగా ఉంచుతుంది. స్థిరమైన త్రిమితీయ (త్రీడైమెన్షనల్‌) ఘన ఆకృతులలో పిరమిడ్లు ప్రముఖమైనవి. ఈజిప్టు పిరమిడ్‌ ఏదీ పూర్తిగా ఘనరూపం కాదు. మధ్యలో నిలువ్ఞగా సన్నని గుహ లాంటిది ఉంటుంది. పిరమిడ్‌ పార్శ్వ గోడల నుంచి ఒకటి,రెండుచోట్ల ఈ గుహలోకి నాళిక ల్లాంటి దారులు ఉంటాయి. సాధార ణంగా ఇవి కిందివైపు మెట్లతో (దిగుడుబావిలోకి దిగినట్లుగా) ఉంటాయి. అక్కడక్కడా అవి మధ్య గుహలోకి వెళ్లాక అక్కడ విశాలమైన ప్రాంతం లోకి తెరుచుకుంటాయి. ఇదేచోటుకి మెట్లులేని గొట్టాల ద్వారా పిరమిడ్‌ పక్కగోడ లకు దారులు ఉంటాయి. ఇవి గాలిని లోనికి పంపి, బయట, లోపల సమానవాయుపీడనం ఉండేలా చేస్తాయి. గరిమనాభి నుంచి కింది వైపుకు నిలువ్ఞగా గీచిన ఊహారేఖ ఆధారపీఠం గుండా వెళ్లి నట్లయితే ఆ వస్తువ్ఞ పడిపోదనీ, ఆ గీత ఆధారపీఠం నుంచి పూర్తిగా ఒకవైపుకు విడిగా వెళితేనే వస్తువ్ఞ పడిపోతుందనీ స్కూల్లో నేర్చుకుంటాం. ఆ సూత్రం ఆధారంగా ఒకవస్తువ్ఞ మీద మరో వస్తువ్ఞను ఉంచడానికి ఎలాంటి జిగురు, సిమెంటు అవసరం లేదు. మనం గ్రంథాలయంలో 20 పుస్తకాలను ఒక దానిమీద ఒకటిగా పేర్చామనుకోండి. అవి పడి పోకుండా ఉంచాలంటే విడిగా వాటిని కట్టాలని గాని, పుస్తకానికీ, పుస్తకానికి మధ్య జిగురు పెట్టాలన్న నిబంధనగానీ లేదుకదా. కొన్నివేల మంది కార్మికులు, కొన్ని దశాబ్దాలపాటు శ్రమిస్తూ, ఏనుగులు, గుర్రాలను వాడుకొంటే పిరమిడ్ల నిర్మాణం రాజులకు సులభసాధ్యమే.

ప్రపంచపు వింత- గీజా పిరమిడ్
‘మమ్మిఫై’ చేసిన ఫారోల శరీరాలను అందుకోసమే ప్రత్యేకంగా నిర్మించిన గొప్ప గొప్ప కట్టడాల్లో భద్రపరచేవాళ్ళు- అవే ఈజిప్టు పిరమిడ్లు. వాటిలో అన్నింటికంటే పెద్దది, ‘ఖూఫూ’ అనే ఫారో తన శరీరాన్ని భద్రపరచటంకోసం తానుగా కట్టించుకున్న ‘గీజా’ పిరమిడ్.

దాని ఎత్తు 455 అడుగులు! అంటే కనీసం‌ 45 అంతస్తుల భవంతి అంత!

నేలమీద దాని పొడవు, వెడల్పు 756 అడుగులు!

దానికోసం వాడింది 23,00,000 బండలు. వాటి మొత్తం బరువు కనీసం 59,00,000 టన్నులు! ఇంత బరువును పూర్తిగా మనుషులు- ఎడారి దాటించి తీసుకొచ్చారు- క్రేన్లు, యంత్రాలు ఏవీ‌ వాడకుండా

గీజా పిరమిడ్ నిర్మాణానికి మొత్తం 20 సంవత్సరాలు పట్టిందట. ప్రతిరోజూ సరాసరి 14,000 మంది పనివాళ్ళు పని చేశారట. అవసరం ఉన్నప్పుడు ఒక్కోసారి 40,000 మంది కూడా పని చేశారట! ఇంత పెద్ద పిరమిడ్ నిర్మాణంలో వచ్చిన తేడాల్లా కేవలం 5.8 సెంటీమీటర్లు! పిరమిడ్ ముఖాలు నాలుగూ డిగ్రీలో వందో వంతు తేడా కూడా లేకుండా ఖచ్చితంగా తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిశల్ని సూచిస్తున్నాయి!

ఈజిప్ట్ పిరమిడ్స్ రహస్యం

గగన తలం నుంచి తీసిన వీడియో