అక్టోబర్‌లో రాబోయే మూడు 7 సీటర్ కార్లు.. ఈ లిస్టులో ఎలక్ట్రిక్ వెహికల్

www.mannamweb.com


కొత్తగా 7 సీటర్ కారు కొనాలని చూస్తున్నారా? అయితే అక్టోబర్‌లో మీకోసం కొన్ని కార్లు లాంచ్ అవుతున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది. అక్టోబర్‌లో లాంచ్ కాబోయే మూడు కార్ల గురించి తెలుసుకుందాం..

మీరు కొత్త 7-సీటర్ కారు కొనాలని ఆలోచిస్తుంటే.. ఈ న్యూస్ మీ కోసమే. అక్టోబర్ నెలలో మూడు కార్లు లాంచ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మీకు నచ్చినది సెలక్ట్ చేసుకోవచ్చు. మారుతి సుజుకి ఎర్టిగా, టయోటా ఇన్నోవా క్రిస్టా, టయోటా ఇన్నోవా హైక్రాస్, టయోటా ఫార్చ్యూనర్ వంటి కార్లు 7 సీట్ల విభాగంలో భారతీయ వినియోగదారులలో చాలా ప్రాచుర్యం పొందాయి. దీంతో దిగ్గజ కార్ల తయారీ సంస్థలు అక్టోబర్‌లో 3 కొత్త 7-సీటర్ మోడళ్లను విడుదల చేయబోతున్నాయి. ఈ కార్ల జాబితాలో ఎలక్ట్రిక్ మోడళ్లు కూడా ఉన్నాయి. వచ్చే నెలలో లాంచ్ కానున్న కార్ల ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.

కియా కార్నివాల్

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా అప్‌డేటెడ్ కార్నివాల్‌ను అక్టోబర్ 3న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. అప్‌డేటెడ్ కియా కార్నివాల్ ఎక్ట్సీరియర్, ఇంటీరియర్‌లో భారీ మార్పులు ఉండబోతున్నాయి. అయితే ఈ కారు పవర్‌ట్రెయిన్‌లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. కొత్తగా వచ్చే కియా కార్నివాల్ ధర రూ.50 లక్షలకు పైగా ఉంటుందని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
కియా ఈవీ9

భారతీయ వినియోగదారులలో ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా కియా ఇండియా కియా ఈవీ9 అక్టోబర్ 3న ఫ్లాగ్షిప్ మోడల్‌ను విడుదల చేయనుంది. కంపెనీ రాబోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కియా ఈవి9.., ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 561 కిలో మీటర్ల పరిధిని అందించగలదు.
బీవైడీ ఈ6

మరోవైపు అప్‌డేట్ చేసిన బీవైడీ ఈ6 ఎమ్‌‍‌పీవీ కూడా అక్టోబర్ 8న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. రాబోయే ఎమ్‌పీవీకి బీవైడీ ఇమ్యాక్స్ 7 అని పేరు పెట్టారు. ఈ ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీ కోసం ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే రూ.51,000 ప్రారంభ రీఫండబుల్ టోకెన్‌తో ప్రారంభమయ్యాయి. అంటే అక్టోబర్ 8వరకు మెుదటగా బుక్ చేసుకునే వెయ్యి మందికి రూ.51 వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. బీవైడీ ఇమ్యాక్స్ 7 రెండు బ్యాటరీ ఆప్షన్లతో విదేశీ మార్కెట్లలో అందుబాటులో ఉంది. 55.4 కిలోవాట్ల బ్యాటరీ 420 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. 71.8 కిలోవాట్ల పెద్ద బ్యాటరీ 530 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.