ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లోకి తీసుకురావడానికి చాలా కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే రకరకాల మోడల్స్ ఇప్పటికే మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. అందుకే హోండా కూడా తన కొత్త HEV ZR-V ని ప్రవేశపెట్టింది.
ఇండియాలో జరిగిన వార్షిక డీలర్ల సమావేశంలో ఈ కారుని ప్రదర్శించారు. దీన్ని బట్టి కొత్త కారు త్వరలోనే మార్కెట్లోకి రాబోతుందని అర్థమవుతోంది. ఇప్పటికే ఉన్న సిటీ e:HEV తర్వాత ఇది హోండా నుండి వస్తున్న రెండవ హైబ్రిడ్ కారు ఇది.
Honda ZR-V e: HEV డిజైన్ హోండాలో ఇప్పటివరకు ఉన్న కార్ల కన్నా కాస్త భిన్నంగా ఉంది. కారు ముందు భాగంలో ఎలివేట్ కారులో ఉన్న గ్రిల్ లాంటిదే ఉంది. కానీ దీనిలో రేడియేటర్ గ్రిల్ వరకు వంపులు, గీతలు కలిగిన డిజైన్ ఉంది. కొత్త హెడ్ ల్యాంప్ క్లస్టర్, DRLలు కారుకి స్టైలిష్ లుక్ ఇస్తున్నాయి. కారు వెనుక భాగంలో డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్స్ ఉన్నాయి.
ఇంటీరియర్ డిజైన్
కారు ఇంటీరియర్ చాలా స్టైలిష్ గా ఉంది. 10.2 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ADAS లెవెల్ 2 సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
హోండా ZR-V అంతర్జాతీయ మార్కెట్లో రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ హైబ్రిడ్. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇది 181 హెచ్ పి పవర్, 315 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది CVT గేర్ బాక్స్ తో వస్తుంది.
హోండా eHEV సిస్టం
హోండా తన సిటీ E:Hev లో eHEV టెక్నాలజీని ఉపయోగించింది. ఇంజిన్, మోటార్ రెండింటి నుండి పవర్ ని ఉపయోగించుకునేలా హైబ్రిడ్ మోడ్ లో కారు నడుస్తుంది. ఈ మోడ్ లో ఇంజిన్ బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి జనరేటర్ లాగా పనిచేస్తుంది. లిథియం-అయాన్ బ్యాటరీలు EV డ్రైవ్ మోడ్ లో చక్రాలను తిప్పుతాయి.
అంతేకాకుండా 1.5 cc ఇంజిన్ కారుని నడిపే సాధారణ మోడ్ కూడా ఉంది. పూర్తిగా EV కి మారడానికి ఇష్టపడని వారికి ఇది మంచి ఆప్షన్. కానీ దాదాపు రూ.19.79 లక్షల నుండి రూ.20 లక్షల వరకు ధర ఉండటం కొంచెం ఎక్కువ.
EV కన్నా మంచి మైలేజ్?
హైబ్రిడ్ కారు పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ రెండింటితోనూ నడుస్తుంది. కాబట్టి దీని రేంజ్ ఎక్కువ. EVలకు ఛార్జింగ్ అవసరం. సిటీ E:hev మైలేజ్ లీటరుకు 27 కి.మీ. వస్తుంది. కొత్త SUV కి మంచి డిమాండ్ ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.