విద్యుత్ ఛార్జీలపై కీలక ప్రకటన

www.mannamweb.com


ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి విద్యుత్ ఛార్జిల విషయంలో గందరగోళం నెలకొంది. గృహ వినియోగదారుల కరెంట్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వానికి విద్యుత్ శాఖ ప్రతిపాదనలు చేసింది.

ఈ మేరకు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో విపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. ఆందోళనకు దిగాయి. వైసీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. పెంచి ఛార్జీలు తగ్గించాల్సిన డిమాండ్ చేశాయి.

అయితే విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. అభ్యంతరాలను స్వీకరించింది. వర్చువల్ విధానంలోనూ ప్రజల అభిప్రాయాన్ని అధికారులు తెలుసుకున్నారు. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించాలని విద్యుత్ నియంత్రణ మండలి, ప్రభుత్వం, పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలి కీలక ప్రకటన చేసింది. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేసింది. 2025-26 సంవత్సరానికి గాను విద్యుత్ ఛార్జీల భారం ఉండదని విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ఠాగూర్ రామ్ సింగ్ వెల్లడించారు. రూ. 14,683 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఠాగూర్ రామ్ సింగ్ పేర్కొన్నారు.