మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 59 వేల జీతం అందుకోవచ్చు. ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్ మెంట్ ఇండియా లిమిటెడ్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఫైర్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్ స్పెక్షన్, ఇన్ స్ట్రుమెంటేషన్, మెకానికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 57 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అర్హులు ఎవరంటే?
ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పీడీఐఎల్ కార్యాలయాలు/ ప్రాజెక్ట్ సైట్‌లో పలు విభాగాల్లో 57 ఇంజినీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంటర్ (సైన్స్ సబ్జెక్టులు), ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. పోస్టులను అనుసరించి 32 నుంచి 40 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తిగల వారు సెప్టెంబర్ 11వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
మొత్తం ఖాళీలు : 57
డిప్లొమా ఇంజినీర్ పోస్టులు: 04
డిగ్రీ ఇంజినీర్ పోస్టులు: 53
అర్హత:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్ (సైన్స్ సబ్జెక్టులు), ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
పోస్టులను అనుసరించి 32 నుంచి 40 ఏళ్ల వయసు కలిగి ఉండాలి.
జీతం:
పోస్టులను అనుసరించి 28 వేల నుంచి 59 వేల వరకు పొందొచ్చు.
దరఖాస్తు ఫీజు:
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.400 చెల్లించాలి.
దరఖాస్తు విధానం :
ఆన్‌లైన్
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:
11-09-2024
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు:
అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహిస్తారు.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ వేదిక:
పీడీఐఎల్ భవన్, నోయిడా.