ఇంట‌ర్‌తో ఎన్‌డీఏలోకి అడుగుపెట్టి ల‌క్షకుపైగా జీతం పొందండి!

ఏటా యూపీఎస్‌సీ నిర్వహించే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ అండ్‌ నేవల్‌ అకాడెమీ (ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ) పరీక్షకు స‌మ‌యం వ‌చ్చింది. దేశ రక్షణలో భాగస్వాములు కావాలని ఆశించే యువత‌కు ఎన్‌డీఏ వార‌దిలా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో బీఏ, బీఎస్సీ, బీటెక్‌లలో నచ్చిన కోర్సు ఉచితంగా చ‌దువుకుని, శిక్షణ త‌ర్వాత కేంద్ర ర‌క్షణ రంగంలో లెవెల్‌-10 వేతనశ్రేణితో ఆర్మీ/నేవీ/ఎయిర్‌ ఫోర్స్‌లలో ఉద్యోగం పొంద‌వ‌చ్చు. ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ – 2024(2) ప్రకటనకు సంబందించిన విశేషాలు మీకోసం…


ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ పరీక్షను యూపీఎస్‌సీ ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తోంది. ఈ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త సాధించిన‌వారు ఎంపికైనవారు పుణెలోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ (ఎన్‌డీఏ)లో బీటెక్, బీఎస్సీ, బీఏ కోర్సులు చదువుకుంటూ వ‌స‌తి, భోజ‌నం ఉచితంగా పొందుతూ రక్షణ రంగంలో ప్రాథమిక శిక్షణ తీసుకోవ‌చ్చు. నేవల్‌ అకాడెమీ (ఎన్‌ఏ)కి ఎంపికైనవాళ్లు కేరళలోని ఎజమాళలో బీటెక్ విద్య అలాగే, ఎన్‌డీఏ, ఎన్‌ఎల్లో చదువు పూర్తిచేసుకున్నవారికి జేఎన్‌యూ, న్యూదిల్లీ డిగ్రీలను ప్రదానం అందిస్తోంది. ఈ శిక్ష‌ణ‌ సమయంలో ప్రతినెలా రూ.56,100 ఉప‌కార‌వేతం అందిస్తారు. ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీలో సబ్‌ లెఫ్టినెంట్, ఎయిర్‌ ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ (పైలట్‌)/ గ్రౌండ్‌ డ్యూటీ ఆఫీసర్‌ హోదాతో విధులు నిర్వహిస్తూ.. మొదటి నెల నుంచే రూ.లక్షకుపైగా జీతం పొందుతారు.

ఖాళీలు వివ‌రాలు..

ఆర్మీ వింగ్‌కు ఏదైనా గ్రూపుతో ఇంటర్‌ ఉత్తీత‌, ఎయిర్‌ ఫోర్స్, నేవల్‌ వింగ్స్‌ (ఎన్‌డీఏ), 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ (ఇండియన్‌ నేవల్‌ అకాడమీ)లకు ఎంపీసీ గ్రూపుతో జనవరి 2, 2006 – జనవరి 1, 2009 మధ్య జన్మించి ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరంలో ఉన్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీలో 370 (ఆర్మీ 208 (10 మహిళలకు), నేవీ 42 (6 మహిళలకు), ఎయిర్‌ ఫోర్స్‌ మొత్తం 120 ఇందులో 92 ఫ్లైయింగ్‌ (2 మహిళలకు), గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ 18 (2 మహిళలకు), గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్‌ 10 (2 మహిళలకు)) ఉన్నాయి. నేవల్‌ అకాడెమీ (10+2 క్యాడెట్‌ స్కీం)లో 34 (5 మహిళలకు) ఖాళీలు ఉన్నాయి. పరీక్ష‌కు తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ ప‌రీక్షా కేంద్రాలు ఉన్నాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జూన్‌ 4 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు మినహాయించారు.

పరీక్ష తేదీ: సెప్టెంబరు 1

వెబ్‌సైట్‌: https://upsc.gov.in/