Epsom Salt Bath : మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. శరీరానికి తగినంత నిద్ర లభించకపోయిన కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
మనకు సుఖమైన నిద్ర కావాలంటే నిద్ర పోయే ముందు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే మనం స్నానం చేయాలి. మనం నిద్ర లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేసి అటు మానసికంగా, ఇటు శారీరకంగా అలసిపోతూ ఉంటాం.
అంతేకాకుండా పని చేయడం వల్ల కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు వంటివి కూడా వస్తూ ఉంటాయి.
ఒత్తిడి, అలాగే నొప్పులు తగ్గి మనకు చక్కగా నిద్ర పట్టాలంటే మనం నిద్రపోయే ముందు స్నానం చేయాలి. సాధారణ నీటితో కాకుండా మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ ను వేసి ఆ నీటితో స్నానం చేయాలి.
ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు అలసట, నొప్పులు కూడా తగ్గుతాయి. మనకు మార్కెట్ లో ఎప్సమ్ ఉప్పు విరివిరిగా లభిస్తుంది. ఈ ఉప్పులో ఉండే మెగ్నీషియం అణువులు మన స్నానం చేసినప్పుడు మన శరీరంలోకి వెళ్లి వెంటనే పని చేయడం ప్రారంభిస్తాయి.
దీంతో కీళ్ల నొప్పులు, వాపులు, కండరాల నొప్పులు వెంటనే తగ్గుతాయి. దీంతో మన శరీరం తేలిక పడి చక్కటి నిద్ర పడుతుంది.
Epsom Salt Bath
అంతేకాకుండా ఈ ఉప్పు వేసిన నీటితో స్నానం చేయడం వల్ల శరీరం నుండి దుర్వాసన రాకుండా ఉంటుంది. చర్మం పొడి బారకుండా ఉంటుంది. ఈ ఎప్సమ్ ఉప్పుతో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
రోజుకు రెండు పూటలా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ ఎప్సమ్ ఉప్పును వేసి కలిపి తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పులు తగ్గుతాయి. ఎముకలు కూడా దృఢంగా మారతాయి.
ఈ ఉప్పులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ఎప్సమ్ ఉప్పు మనకు సహాయపడుతుంది.
ఈ ఎప్సమ్ ఉప్పును తీసుకోవడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది.
ఈ విధంగా ఎప్సమ్ ఉప్పు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.