ఒక్కసారి పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెల లక్షలు సంపాదించండి ..ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కోసం ఏం చేయాలంటే ?

www.mannamweb.com


ఈ ద్రవ్యోల్బణం యుగంలో పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి ధరలు పెరుగుతుండడంతో ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. పొదుపుగా ఉండటం వల్ల నగరంలో లేదా పల్లెల్లో అనే తేడా లేకుండా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతోంది. దీని వల్ల కాలుష్యం కూడా ఉండదు.

రవాణా రంగం అభివృద్ధికి చోదక శక్తి లాంటిది. మానవ వనరులు, వస్తువులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించకుండా అభివృద్ధి సాధ్యం కాదు. అన్ని ముఖ్యమైన రవాణా రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలు విప్లవాత్మక మార్పులను తీసుకువస్తున్నాయి. కానీ.. భారతదేశంలో తగినంత ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులకు సమస్యగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఛార్జింగ్ స్టేషన్లు దేశ వ్యాప్తంగా విస్తృతంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈవీ వాహనాలను ఉత్పత్తి చేసే పరిశ్రమలు కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లుకు మద్దతు అందించాల్సి ఉంది.

ఈ ద్రవ్యోల్బణం యుగంలో పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి ధరలు పెరుగుతుండడంతో ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. పొదుపుగా ఉండటం వల్ల నగరంలో లేదా పల్లెల్లో అనే తేడా లేకుండా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతోంది. దీని వల్ల కాలుష్యం కూడా ఉండదు. ఉదాహరణకు ఈ-రిక్షాను తీసుకోండి. దేశంలోని ప్రతి వీధి, మూలలో ప్రజలు దీనిని నడపడం చూసే ఉంటాం. వాటి వల్ల ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ (EV Charging station) బిజినెస్ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుగా రోడ్డు పక్కన 50 నుండి 100 చదరపు గజాల స్థలం అవసరం. ఈ భూమి మీ పేరు మీద ఉండవచ్చు లేదా పదేళ్లపాటు లీజుకు తీసుకోవచ్చు. అలాగే, ఛార్జింగ్ స్టేషన్‌లో తగినంత స్థలం ఉండాలి. తద్వారా వాహనం పార్కింగ్ లేదా మూవ్ కావడానికి సులభంగా ఉంటుంది. అంతేకాకుండా వాష్‌రూమ్‌(Wash room), అగ్నిమాపక యంత్రం, తాగునీటి సౌకర్యం వంటి కొన్ని ప్రాథమిక సౌకర్యాలు కూడా ఉండాలి.

ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌కు స్టేషన్ సామర్థ్యాన్ని బట్టి రూ. 15 లక్షల నుండి రూ. 40 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇందులో భూమి(Land), ఇతరత్రా చేసే ఖర్చులు వేరు. కానీ దాని సెటప్ కోసం మీరు చాలా ప్రదేశాల నుండి NOC తీసుకోవలసి ఉంటుంది. మీరు మున్సిపల్ కార్పొరేషన్, అగ్నిమాపక శాఖ(Fire department), అటవీ శాఖ నుండి కూడా అనుమతి తీసుకోవాలి. అన్ని శాఖల నుండి అనుమతి పొందిన తర్వాత స్టేషన్ పనిని ప్రారంభించగలరు.

ఇప్పుడు ఖర్చులు అంత అయిపోయిన తర్వాత సంపాదన ఎంతొస్తుందని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఛార్జింగ్ స్టేషన్ 3000 వాట్స్ ఉంటే ఒక్కో వాట్‌కు రూ. 2.5 వరకు సంపాదిస్తారు. దీని ప్రకారం రోజుకు రూ.7,500, నెలకు రూ.2.25 లక్షలు సంపాదించవచ్చు. ఛార్జింగ్ స్టేషన్ సామర్థ్యాన్ని పెంచే కొద్దీ ఆదాయాలు కూడా పెరుగుతాయి.