బాదం టీ ఎప్పుడైనా తాగారా? ఇలా చిటికెలో తయారు చేసుకోండి

www.mannamweb.com


చాలా మందికి ప్రతి ఉదయం కప్పు వేడివేడి టీతో ప్రారంభమవుతుంది. కొంతమంది ఉప్పునీరు తాగి బాత్‌రూమ్‌కి వెళ్తుంటారు. మరికొందరు నీటిలో నానబెట్టిన ఐదు-ఆరు బాదంపప్పులను తినడం అలవాటు చేసుకుంటారు.

అలాగే ఉదయం పూట బాదం టీ.. కూడా తీసుకోవచ్చు. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం సాధారణ టీకి బదులుగా బాదం టీ తాగడం మంచిది.

బాదం టీ పేరు వినగానే ఆశ్చర్యపోతున్నారా? సాధారణ టీ కంటే బాదం టీ చాలా ఆరోగ్యకరమైనది. ఈ టీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బాదం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి. బాదంపప్పులో విటమిన్ ఎ, ఇ, బి2, మెగ్నీషియం ఉంటాయి. అవి టీలో కూడా కనిపిస్తాయి. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. బాదం టీ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా, ఈ టీలో ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. ఇది బరువును అదుపులో ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

బాదంపప్పులో విటమిన్ ఇ ఉంటుంది. బాదం టీ తాగడం వల్ల చర్మం ఎలిస్టిసిటీ పెరుగుతుంది. బాదం టీలో రిబోఫ్లావిన్, ఎల్-కార్నిటైన్ వంటి పదార్థాలు కూడా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

బాదం టీ ఎలా తయారు చేయాలంటే.. కొన్ని బాదంపప్పులను నీటిలో 15 నిమిషాలు నానబెట్టాలి. బాదం పప్పును మిక్సీలో వేసి బాదం పాలు సిద్ధం చేసుకోవాలి. ఆ తరువాత, ఈ బాదం పాలను వేడి చేయాలి.

ఇప్పుడు పాలలో కొంచెం టీ డికాషన్‌, యాలకుల పొడి, తేనె, కుంకుమపువ్వు కలిపి సన్నని సెగపై మరిగిస్తే బాదం టీ సిద్ధం అవుతుంది. మీరు ఉదయాన్నే ఈ బాదం టీని తాగడం ద్వారా మీ రోజును ప్రారంభించవచ్చు.