పెట్రోల్ డీజిల్ వాహనాల కన్నా ఈవీలతోనే ఎక్కువ కాలుష్యం – సంచలన రిపోర్ట్

www.mannamweb.com


Electric Vehicles Emits Pollution: విద్యుత్ వాహనాలతో కాలుష్యమే ఉండదు. వాతావరణ మార్పుల సమస్యని ఎదుర్కోవాలంటే ఈవీల సంఖ్య పెంచాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
వాటికి ప్రోత్సాహకాలూ అందిస్తున్నాయి. అయితే…ఇప్పుడో రిపోర్ట్ సంచలన విషయం వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ వాహనాల కన్నా విద్యుత్ వాహనాల వల్లే ఎక్కువగా వాతావరణం కలుషితం అవుతుందని స్పష్టం చేసింది. Emission Analytics ఇటీవలే ఓ అధ్యయనం చేపట్టి ఈ షాకింగ్ నిజాన్ని చెప్పింది. వాల్స్ట్రీట్ జర్నల్లో ఈ రిపోర్ట్ పబ్లిష్ అయింది. ఈవీల్లోని బ్రేక్లు, టైర్ల ద్వారా Particle Pollution పెరిగే ప్రమాదముందని తెలిపింది. సాధారణ వాహనాలతో పోల్చి చూస్తే ఈవీల బరువు ఎక్కువగా ఉంటుందని.. బ్రేక్లు, టైర్ల ద్వారా గాల్లోకి భారీ మొత్తంలో particulate matter ని విడుదల చేస్తాయని స్పష్టం చేసింది. సాధారణ వాహనాలతో పోల్చితే…ఇది 1,850 రెట్లు ఎక్కువగా ఉంటుందని వివరించింది. ఈవీల బరువు ఎక్కువగా ఉండడం వల్ల టైర్లు త్వరగా చెడిపోతాయి. ఆ సమయంలో గాల్లోకి టైర్ల ద్వారా హానికర రసాయనాలు విడుదలవుతాయి. క్రూడ్ ఆయిల్ నుంచి తీసిన సింథటిక్ రబ్బర్తో ఈ టైర్లను తయారు చేయడమే ఇందుకు కారణం.
దీంతో పాటు బ్యాటరీ బరువు గురించి కూడా ఈ రిపోర్ట్ ప్రస్తావించింది. గ్యాసోలిన్ ఇంజిన్స్తో పోల్చి చూసినప్పుడు ఈవీల బ్యాటరీ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. ఈ అదనపు బరువు కారణంగా బ్రేక్లు, టైర్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగానే గాల్లోకి ఎక్కువ కాలుష్యం విడుదలవుతుంది. ఈ రిపోర్ట్ Tesla ఈవీల గురించి ప్రస్తావించింది. Tesla Model Y తోపాటు Ford F-150 Lightning గురించీ చెప్పింది. ఈ రెండు కార్లలో బ్యాటరీల బరువు 1,800 పౌండ్ల కన్నా ఎక్కువగా ఉందని వెల్లడించింది. గ్యాసోలిన్ కార్తో పోల్చి చూస్తే…ఈ ఎలక్ట్రిక్ వెహికిల్స్ టైర్ల ద్వారా 400 రెట్ల ఎక్కువగా కాలుష్యం విడుదలవుతోందని తేలింది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈవీల్లో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది.

భారత్లో ఫ్యాక్టరీ పెట్టేందుకు టెస్లా (Tesla in India Market) ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. భారత్ కూడా అందుకు సానుకూలంగానే ఉన్నప్పటికీ Import Tax విషయంలో రాజీ కుదరడం లేదు. ఈ ట్యాక్స్ని తగ్గించాలని టెస్లా ప్రతిపాదించింది. అందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. చాలా రోజులుగా దీనిపై చర్చ జరిగింది. ఇన్నాళ్లకు అధికారికంగా ఓ ప్రకటన చేసింది. దిగుమతి చేసుకునే విద్యుత్ వాహనాలపై ఇంపోర్ట్ ట్యాక్స్ (Import Tax on Tesla Vehicles)తగ్గించే ఆలోచన ఏమీ లేదని స్పష్టం చేసింది. ఇండియన్ మార్కెట్లో పాగా వేయాలని చూస్తున్న టెస్లాకి ఇది ఊహించని షాక్. పార్లమెంట్లో ఈ ప్రస్తావన రాగా..లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు వాణిజ్యశాఖ మంత్రి సోమ్ ప్రకాశ్. దిగుమతి చేసుకునే విద్యుత్ వాహనాలపై వేసే ట్యాక్స్ విషయంలో ఎలాంటి సబ్సిడీలు ఇచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు.