పాఠశాలలకు దసరా సెలవులు పొడిగింపు – ఏపీ ప్రభుత్వం నిర్ణయం

పీ ప్రభుత్వం దసరా సెలవుల పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రకటించిన దసరా సెలవులను మరో రెండు రోజులు పొడిగిస్తూ నిర్ణయం ప్రకటించారు. తొలుత ప్రభుత్వం దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించగా..


మరో రెండు రోజులు పొడిగింపు పైన ఉపాధ్యాయుల అభ్యర్ధన పైన ఎమ్మెల్సీలు మంత్రి లోకేష్ కు వివరించారు. దీంతో, మంత్రి లోకేష్ తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు దసరా సెలవుల పొడిగింపు పైన నిర్ణయం వెలువడింది.

ఏపీ ప్రభుత్వం దసరా సెలవులు మరో రెండు రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఈ నెల 24 వ తేదీ నుంచి సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ సెలవులు ప్రకటించారు. విద్యార్థులకు మొత్తంగా 9 రోజులు ఇచ్చారు. ఇక తెలంగాణలో ఇప్పటికే దసరా సెలవులను ప్రకటించారు.

ఈ నెల 21వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. అంటే మొత్తంగా 13 రోజులు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 4వ తేదీన స్కూల్స్ రీఓపెన్ అవుతాయి. అయితే, ఏపీలో సెలవుల విషయంలో ప్రభుత్వానికి కొత్తగా అభ్యర్ధనలు అందాయి. దీని పైన తాజాగా ఎమ్మెల్సీలు మంత్రి లోకేష్ ను కలిసి ఉపాధ్యాయుల అభ్యర్ధన పైన వివరించారు.

కాగా, తాజాగా మంత్రి లోకేష్ సెలవుల పైన ప్రకటన చేసారు. పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేసారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో, ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.

ఈ నిర్ణయం ద్వారా ఈ ఆదివారం నుంచి తిరిగి అక్టోబర్ 2వ తేదీ వరకు వరుసగా విద్యా సంస్థలకు సెలవులు అమలు కానున్నాయి. అటు దసరా వేళ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు రైళ్లు, బస్సుల ద్వారా పేరెంట్స్ రిజర్వేషన్లు చేసుకున్నారు. రైల్వే, ఆర్టీసీ సైతం ప్రత్యేకంగా సర్వీసులను ప్రకటించింది. ఈ రెండు రోజుల అదనపు సెలవులతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.