Fact Check : పీటీఐ పేరుతోనూ ఆంధ్ర ఎన్నికలపై ఫేక్ సర్వేలు – ఇదే అసలు నిజం !

www.mannamweb.com


PTI survey on AP elections is fake : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీంతో అక్కడి రాజకీయ పార్టీలు అన్ని రకాల అస్త్రాలతో ఎన్నికల యుద్ధం చేస్తున్నాయి.

ఇందులో ఫేక్ పోస్టులు వైరల్ చేయడం కూడా ఒకటిగా కనిపిస్తోంది. పోటాపోటీగా రెండు వైపు నుంచి ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారు. ఇలా చేస్తున్న వాటిలో సర్వేలు కూడా ఉన్నాయి. తాజాగా ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పీటీఐ సర్వే అంటూ ఒక వార్త వైరల్ అయింది.

ఇందులో అధికార వైఎస్ఆర్సీపీ ఎక్కువ సీట్లు గెల్చుకుంటుందన్నట్లుగా ఉంది. ఇది వైరల్ కావడంతో పీటీైఐ సంస్థ స్పందించింది. ఇంటూరి రవి కిరణ్ అనే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఈ పోస్టును తన సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టారు. ( ఇక్కడ )

ఈ వైరల్ పోస్టుపై పీటీఐ ఫ్యాక్ట్ చెక్ బృందం పరిశీలన జరిపింది. పీటీఐ వాటర్ మార్క్ తో ఉన్న సర్వేను PTI అసలు పబ్లిష్ చేయలేదని తేలింది. PTI అసలు ఎలాంటి ప్రీపోల్ సర్వేను ప్రచురించలేదని ఆ స్క్రీన్ షాట్ ఫేక్ అని స్పష్టం చేసింది.

క్లెయిమ్
మే 7వ తేదీన ఓ ఫేస్బుక్ యూజర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని ఓ ప్రీపోల్ సర్వేను ప్రకటించారు. పీటీఐ వాటర్ మార్క్తో ఉన్న ఆ సర్వేను PTI ప్రకటించిన సర్వే అనే అర్థంలో పోస్టు చేశారు. వాటి లింకులు ఇవి ( ఇక్కడ & ఇక్కడ ). ట్విట్టర్లోనూ పలువురు లింక్స్ షేర్ చేశారు.

ఇన్వెస్టిగేషన్

ఈ స్క్రీన్ షాట్ను కాసేపటికే వైరల్ చేసినట్లుగా PTI సిబ్బంది గుర్తించారు. ఫేస్ బుక్, ఇన్ స్టాలతో సహా పలు చోట్ల ఈ ఫేక్ స్క్రీన్ షాట్ కనిపించింది. వాటిని ఇక్కడ.. ఇక్కడ చూడవచ్చు.

వెంటనే ఈ స్క్రీన్ షాట్కు సంబంధించి PTI వెబ్సైట్ టీంతో పాటు ఇతర న్యూస్ వెబ్ సైట్స్ ను స్కాన్ చేసిన తర్వాత ఇలాంటి ప్రీపోల్ సర్వేను చేయలేదని తేలింది.

” ఇది ఫేక్ స్క్రీన్ షాట్. ఇలాంటి ప్రీపోల్ సర్వేలు PTI ప్రకటించలేదు. కొంత మంది తప్పుడు పద్దతుల్లో PTIలోగోను ఉపయోగించుకున్నారు ” అని PTI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ జి సుధాకర్ నాయర్ పీటీఐ ఫ్యాక్ట్ చెక్ డెస్క్కు స్పష్టం చేశారు.

చివరిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడి్యాలో PTI వాటర్ మార్క్ తో షేర్ అవుతున్న స్క్రీన్ షాట్ ఫాల్స్ అని తేలింది.

క్లెయిమ్
ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై PTI చేసినట్లుగా చెబుతున్న ప్రీపోల్ సర్వే

ఫ్యాక్ట్
ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై PTI అలాంటి ప్రీపోల్ సర్వేలు ప్రకటించలేదు. అది ఫేక్ న్యూస్.

కంక్లూజన్
ఏపీ ఎన్నికలపై PTI సర్వే అంటూ సర్క్యూలేట్ అవుతున్న స్క్రీన్ షాట్ ఫేక్. అలాంటి సర్వేలను పీటీఐ ప్రకటించలేదు.