మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో విషాదం..శోకసంద్రంలో కుటుంబసభ్యులు

మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన 14 ఏళ్లుగా ఎంతగానో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క మరణించింది. ఈ విషయాన్ని నాగబాబు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రియమైన ఫ్లాష్..14 సంవత్సరాల నుండి నీతో మాకు ఉన్న అనుబంధం వెలకట్టలేనిది. నువ్వు చూపించిన ప్రేమ, చేసిన అల్లరిని మేము ఎప్పటికీ మరచిపోలేము. ఇక ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. నీతో గడిపిన మధుర క్షణాలను మేము మా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము.


నీవు లేని లోటు ఎవ్వరూ పూడ్చలేనిది. ఒక జంతువుగా కాదు, మా కుటుంబంలో ఒక మనిషిలాగా నిల్చిపోయావు. ముఖ్యంగా నా కూతురు నిహారిక కి నువ్వు ఎంతో నమ్మకస్తుడివి. ఆమె దినచర్య నీతోనే మొదలు అవుతుంది. అలాంటిది ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటో నాకు కూడా అర్థం కావడం లేదు. ఇదే నీకు మా చివరి వీడ్కోలు. స్వర్గం లో ప్రశాంతంగా ఆడుకో, మేమంతా నిన్ను ఎంత మిస్ అవుతున్నామో మాటల్లో వర్ణించలేం’ అంటూ నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఇక నాగబాబు విషయానికి వస్తే.. ఆయన తన తమ్ముడు జనసేన పార్టీలో కీలకంగా ఉన్నారు.గత ఎన్నికల్లో నాగబాబు విసృతంగా పని చేసిన సంగతి తెలిసిందే.కూటమి అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగానే కష్టపడ్డారు.ఒకనొక సమయంలో ఆయన ఎంపీగా పోటీ చేయడానికి కూడా రెడీ అయ్యారు. అయితే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం, సీట్ల సర్దుబాటు విషయంలో నాగబాబు తన సీటును త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీటు దక్కకపోయినప్పటికి నాగబాబు ఎటువంటి అసంతృప్తి వ్యక్తం చేయకుండా తమ్ముడు పవన్ స్థాపించిన జనసేన విజయం కోసం చెమటోడ్చారు. కూటమి అధికారంలోకి రావడంతో నాగబాబుకు మంత్రి బెర్త్ కన్ఫర్మ్ అయింది. త్వరలోనే ఆయన ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలో కూటమి సర్కార్ ఉంది.