అభిమానులూ.. అర్థం చేసుకోండి.! పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు విజ్ఞప్తి.

www.mannamweb.com


పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఓ సొంత ఫ్యాన్‌ బేస్‌ను సొంతం చేసుకున్నారు పవర్‌ స్టార్‌.. తనదైన నటనతో కోట్లాదిమంది అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. ప్రేక్షకులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు సైతం పవన్‌కు వీరాభిమానులు అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇక పవర్‌స్టార్‌ పుట్టిన రోజు అంటే అభిమానుల ఆనందానికి అవధులుండవ్.. సెప్టెంబర్‌ 2 పవర్‌స్టార్‌ పుట్టినరోజు సందర్భఃగా ఆయన అప్‌కమింగ్‌ మూవీస్‌కు సంబంధించి వివరాలు ప్రకటిస్తామని నిర్మాణసంస్థలు ఇటీవల ప్రకటించాయి. అయితే తాజాగా వాటిని రద్దుచేస్తున్నట్టు నిర్మాణ సంస్థలు వెల్లడించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ విడుదల కావాల్సిన అప్‌డేట్స్‌ను క్యాన్సిల్‌ చేస్తున్నట్లు ప్రకటించాయి.

పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓజీ’ . ఈ సినిమా నుంచి పవన్‌ పుట్టినరోజు నాడు అప్‌డేట్స్‌ ఇస్తామని ఇటీవల నిర్మాణ సంస్థ ప్రకటించింది. తాజాగా దాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ‘ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందుకు పడుతున్నారు. వరదల కారణంగా బర్త్‌డే కంటెంట్‌ రిలీజ్‌ను రద్దు చేస్తున్నాం. ఓజీ సినిమా కొన్నేళ్ల పాటు సెలబ్రేట్‌ చేసుకునేలా ఉంటుంది. మనందరం కలిసి ఈ విపత్కర పరిస్థితులను అధిగమించి.. త్వరలోనే భారీ సెలబ్రేషన్స్‌ చేసుకుందాం అని పేర్కొంది. పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేయడం లేదని తెలిపింది. అలాగే పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈరోజు పవన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్‌ విడుదల చేయాలని మేకర్స్‌ భావించారు. తాజాగా దాన్ని కూడా క్యాన్సిల్‌ చేసినట్టు తెలిపారు.పవన్‌ ఫ్యాన్స్‌ కోసం ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ డిజైన్‌ చేశాం. దాన్ని ఈరోజు రిలీజ్‌ చేద్దామని అనుకున్నాం. కానీ ఈ సమయంలో పోస్టర్‌ రిలీజ్‌ చేయడం సరికాదని భావిస్తున్నాం. అందరూ అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం’ అని టీమ్‌ ప్రకటించింది. ఈ సినిమాకు తొలుత క్రిష్‌ దర్శకత్వం వహించగా.. ఇటీవలే ఆయన ఈ సినిమా నుంచి వైదొలగినట్లు టీమ్‌ ప్రకటించింది. ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించనున్నట్లు తెలిపింది.