FASTAG KYC అప్‌డేట్ గడువు పొడిగింపు.. ఆ తేదీ తర్వాత కార్డులను బ్లాక్‌ చేస్తామని హెచ్చరిక..!

జాతీయ రహదారులపై టోల్‌ గేట్లను ఏర్పాటుచేసిన టోల్‌ రుసుంను కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది. కొన్ని సంవత్సరాలపాటు నేరుగానే చెల్లింపులు నిర్వహించింది.


అనంతరం ఈ ప్రక్రియలో కీలక మార్పులు చేస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని కొన్ని టోల్‌ ప్లాజాల వద్ద FASTAG వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. 2021లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకొంది.

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (నేషనల్‌ హైవే ఆథారిటీ ఆఫ్‌ ఇండియా- NHAI)– Fastag KYCను జనవరి 31లోగా అప్‌డేట్‌ చేసుకోవాలని తొలుత స్పష్టం చేసింది. లేకుంటే అనంతరం ఫాస్టాగ్‌ ఖాతాల్లో బ్యాలెన్స్‌ ఉన్నాగానీ డియాక్టివేట్‌ అవుతాయని హెచ్చరించింది. తాజాగా ఈ తేదీపై కీలక నిర్ణయం తీసుకుంది.

 

ఫాస్టాగ్‌ కేవైసీ అప్‌డేట్‌ గడువు తేదీని ఫిబ్రవరి 29 వరకు పొడిగిస్తున్నట్లు NHAI వెల్లడించింది. వాహనదారులు వీలైనంత త్వరగా కేవైసీ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని కోరింది. లేకుంటే మార్చి 1వ తేదీ నుంచి ఫాస్టాగ్‌ కార్డులు డియాక్టివేట్‌ అవుతాయని స్పష్టం చేసింది.

ఇప్పటి వరకు ఫాస్ట్ ట్యాగ్‌ కార్డులు లేని వాహనాలు అదనపు రుసుము చెల్లించి మాత్రమే టోల్‌గేట్‌లు దాటేవి. అయితే ఈ క్రమంలో కొందరు వాహనదారులు ఒకే వాహనం కోసం ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్‌లతో మోసాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో NHAI కీలక నిర్ణయం తీసుకున్నాయి.

ఒకే వాహనం- ఒకే ఫాస్టాగ్‌ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం వాహనదారులందరూ ఫాస్టాగ్‌ కార్డులకు KYC చేయాలని స్పష్టం చేసింది. దీంతోపాటు కొత్తగా జారీ చేస్తున్న ఫాస్టాగ్‌లను KYC కార్డులుగానే అందిస్తున్నారు. దీంతో మిగిలిన వాహనదారులు కూడా తన ఫాస్టాగ్‌లను KYC అప్‌డేట్‌ చేయాలని సూచించింది.

ఫిబ్రవరి 29వ తేది నాటికి వాహనదారులు అందరూ Fastag KYC అప్‌డేట్‌ చేయాలని లేకుంటే.. మార్చి 1వ తేదీ నుంచి ఆయా కార్డులను బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని హెచ్చరించింది. మరోసారి యాక్టివేట్ చేయబోమని పేర్కొంది. వాహనదారులు వెంటనే తమ వివరాలు అప్‌డేట్‌ చేసుకోవాలని కోరింది.

ఫాస్ట్‌ట్యాగ్‌ KYC అప్‌డేట్‌ చేసే విధానం

Step 1 : FASTAG అధికారిక వెబ్‌సైట్‌ లోకి వెళ్లండి.

Step 2 : వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత రిజిస్టర్డ్‌ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ద్వారా లాగిన్‌ అవ్వండి.

Step 3 : అక్కడ కనిపించే డ్యాష్‌బోర్డు మెనూపైన క్లిక్‌ చేయండి. అనంతరం KYC ట్యా్బ్‌ను ఎంచుకోండి.

Step 4 : KYC ట్యాబ్‌లో అవసరం అయిన సమాచారాన్ని నమోదు చేయండి. అనంతరం సమాచారాన్ని తనిఖీ చేసి, ద్రువీకరించండి. చివరగా సమర్పించు (Submit) పైన క్లిక్‌ చేయండి.

Step 5 : అప్పుడు మీ ఫాస్ట్‌ట్యాగ్‌ KYC అప్‌డేట్‌ పూర్తయినట్లు చూపిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.