తరచూ అలసటగా.. బలహీనంగా అనిపిస్తుందా? వెంటనే ఈ బ్లడ్‌ టెస్ట్ చేయించుకోండి

www.mannamweb.com


Vitamin B12 Deficiency: తరచూ అలసటగా.. బలహీనంగా అనిపిస్తుందా? వెంటనే ఈ బ్లడ్‌ టెస్ట్ చేయించుకోండి

ఎల్లప్పుడూ అలసటగా, బలహీనంగా అనిపిస్తుంటుందా? కడుపు సమస్యలు, మలబద్ధకంతో బాధపడుతున్నారా? కండరాల నొప్పి కూడా వేదిస్తుందా? అయితే ఈ లక్షణాలన్నీ విస్మరించవద్దు.

ఎందుకంటే ఇది విటమిన్ల లోపానికి సంకేతం. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి శరీరంలో తగినంత ప్రోటీన్, విటమిన్లు, వివిధ ఖనిజాలు పుష్కలంగా ఉండాలి. వీటిలో ఏదో ఒక లోపించినా శరీరంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.

విటమిన్ ఎ, సి, ఇ మాదిరిగానే విటమిన్ బి-12 కూడా శరీరానికి చాలా ముఖ్యం. ఇది ఎముకలు, కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అలాగే విటమిన్ B12 ఎర్ర రక్త కణాలను సృష్టించడానికి, మెదడు పనితీరును పెంచడానికి చాలా అవసరం.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విటమిన్-బి12 శరీరానికి చాలా అవసరమైన మూలకం. దీని లోపం శరీరంలో వివిధ సమస్యలను కలిగిస్తుంది. శరీరంలో విటమిన్ బి 12 లోపిస్తే.. తక్కువ మొత్తంలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. దీంతో చర్మం రంగు పాలిపోవడం ప్రారంభమవుతుంది. దీనికితోడు అలసట, మైకం, బలహీనత వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

శరీరంలో విటమిన్ బి12 లోపం తలెత్తితే తలనొప్పి, మైగ్రేన్ సమస్యను పెంచుతుంది. అలాగే శ్వాస సమస్యలు, మానసిక బలహీనత వంటి సమస్యలు కూడా తెలెత్తుతాయి. నాలుక వాపు, నోటిలో పొక్కులు వంటి లక్షణాలు కనిపించినా వెంటనే అలర్ట్ కావాలి.

విటమిన్ బి12 లోపం వల్ల కడుపు సమస్యలు కూడా వస్తాయి. ఈ విటమిన్ సరైన మొత్తంలో లేకపోతే మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఈ సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. చేతులు, పాదాలు, కండరాలలో నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్-బి12 పరీక్ష వెంటనే చేయించుకోవాలి. అలాగే ఈ విటమిన్‌ లోపాన్ని భర్తీ చేయడానికి కొవ్వు చేపలు, మాంసం, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, పాలకూర వంటి వివిధ కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి.