పటాకుల వలన చర్మం కాలితే టూత్‌పేస్ట్ అప్లై చేయవచ్చా.. లేదా నిపుణుల సలహా ఏమిటంటే

www.mannamweb.com


దీపావళి రోజున పటాకులు కాల్చే సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వెంటనే గాయాలకు కొంతమంది వెంటనే టూత్‌పేస్ట్‌ను అప్లై చేస్తారు. ఇలా చేయడం సరైనదేనా కాదా అనేది నిపుణుల నుండి తెలుసుకోండి.

వెలుగుల పండుగ దీపావళి వస్తుందంటే చాలు ఎంతో సందడి నెలకొంటుంది. పిల్లలు, పెద్దలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే దీపావళి పండగ రానే వచ్చేసింది. ప్రజలు తమ ఇళ్లను పువ్వులు, దీపాలతో అలంకరించారు. దీపావళి పండగ రోజున లక్ష్మి గణపతులను పూజించిన తరువాత ఇంటిని దీపాల వెలుగులతో నింపేస్తారు. అంతేకాదు ఈ రోజున పిల్లలు, పెద్దలు బాణాసంచా, క్రాకర్లు కూడా కాలుస్తారు. దీపావళి సందర్భంగా పటాకులు కాలుస్తారు. అయితే ఒకొక్కసారి బాణాసంచా కాల్చే సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. పటాకులు కాల్చే సమయంలో చర్మం కాలిపోవడం చాలా సాధారణ సంఘటనగా చెప్పవచ్చు. కనుక బాణాసంచా కాల్చే సమయంలో పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇలా బాణాసంచా కాల్చే సమయంలో చర్మం కాలితే వెంటనే టూత్ పేస్టుని అప్లై చేస్తారు. అయితే ఇలా బాణాసంచా కాలిన సమయంలో కూడా టూత్ పేస్టు అప్లై చేయడం సరైన చర్య ఏనా తెలుసుకుందాం..

దీపావళి పండుగను రేపు అంటే అక్టోబర్ 31న జరుపుకోనున్నారు. ఈ సమయంలో సాధారణంగా పటాకులు, క్రాకర్లు వంటివి కాలుస్తారు. ఈ సమయంలో చర్మం కాలడం సర్వసాధారణమైన సంఘటనలలో ఒకటి. కనుక దీనికి వెంటనే చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువ మంది కాలిన గాయాలకు టూత్‌పేస్ట్‌ను ఉపయోగిస్తారు. అయితే ఇలా చేయడం ప్రయోజనకరంగా ఉంటుందా లేదా హాని చేస్తుందో తెలుసా..

టూత్‌పేస్ట్‌ను ఎందుకు అప్లై చేస్తారంటే

వాస్తవానికి చాలా టూత్‌పేస్ట్‌లు చర్మానికి చల్లదనం అనుభూతిని ఇస్తాయి. కాలిన సమయంలో తీవ్రమైన మంట ఉంటుంది. దీని కారణంగా ప్రజలు ఉపశమనం కోసం టూత్‌పేస్ట్‌ను అప్లై చేస్తారు. ఎందుకంటే కాలిన గాయంపై టూత్ పేస్ట్ రాయడం వలన తక్షణ ఉపశమనం లభిస్తుంది. అయితే దీపావళి టపాసుల వలన కాలిన గాయం పై టూత్‌పేస్ట్ వేయాలా వద్దా అని తెలుసుకుందాం.

నిపుణుల సలహా ఏమిటంటే..

GTB హాస్పిటల్‌కు చెందిన వైద్యుడు అంకిత్ కుమార్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. చర్మం కాలితే దానిపై టూత్‌పేస్ట్ వేయడం సరికాదన్నారు. ఇలా చేయడం ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తుందని చెప్పారు. ఎందుకంటే చాలా టూత్‌పేస్ట్‌లలో సోడియం ఫ్లోరైడ్ ఉంటుంది. ఇది చర్మానికి హాని కలిగిస్తుంది. చర్మం కాలిన గాయాలపై యాంటీ సెప్టిక్ క్రీమ్ రాసుకోవడం మంచిది. గాయం అయిన వెంటనే గాయం తీవ్రతను బట్టి వైద్యులను సంప్రదించి.. తగిన చర్యలు తీసుకోవాలి.

బాణా సంచా కాలితే ఏమి చేయాలంటే

బాణసంచా కాల్చడం వల్ల చర్మం కాలిపోయినట్లయితే మొదట సమస్య తీవ్రమైనదా కాదా అని తనిఖీ చేయాలి. చర్మం తక్కువగా కాలినట్లయితే.. మొదట కలిగిన గాయం ఉన్న ప్రాంతాన్ని నీటి కింద ఉంచండి.ఇలా చేయడం వలన గాలిన గాయం మీద ఏమైనా గన్‌పౌడర్‌ అంటుకుంటే అది శుభ్రం చేయబడుతుంది. మంట కూడా తగ్గుతుంది. దీని తర్వాత యాంటిసెప్టిక్ లిక్విడ్‌తో గాయాన్ని శుభ్రం చేయాలి. ఇప్పటికే ఇంట్లో స్కిన్ బర్న్ హీలింగ్ క్రీమ్ ఉంటే.. వెంటనే దానిని అప్లై చేయండి. ఒకవేళ బర్న్ హీలింగ్ క్రీమ్ లేకపోతే కొబ్బరి నూనెను అప్లై చేయవచ్చు.

ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే

దీపావళి రోజున క్రాకర్స్ కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా పొరపాటున ఎవరికైనా ఎక్కడైనా కాలితే వెంటనే ప్రభావిత ప్రాంతంలో నేరుగా ఐస్ ముక్కను అప్లై చేయాలి. బొబ్బలు కనిపించినట్లయితే.. వాటిని పగిలిపోయేలా పొరపాటు కూడా ఎటువంటి చికిత్సను చేయవద్దు. బొబ్బలు పగిలితే అక్కడ గాయం ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.