ప్రస్తుత కాలంలో చాలామంది ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఏదైనా వ్యాపారం చేయాలని రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. ముఖ్యంగా ఈ విషయంలో మహిళలైతే తమ కాళ్లపై తాము నిలబడాలని ఎంతో తపన పడుతుంటారు. ఇందుకోసం ఒక్కొక్కరూ ఒక్కో విధంగా బిజినెస్ ఐడియాల గురించి వెతుక్కుంటారు. కానీ, ఎలాంటి బిజినెస్ ను ప్రారంభించాలనుకున్న అది కాస్త బడ్జెట్ తో కూడుకున్న పని అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఎక్కువ పెట్టుబడితే వ్యాపారం చేసే స్థోమత అందరికి ఉండకపోవచ్చు. అందుకోసమే రిస్క్, లాస్ లేని బిజినెస్ లను మొదలుపెట్టాలని ప్రయత్నిస్తుంటారు.ఈ క్రమంలోనే చాలామంది మహిళలు కూరగాయలు, పూలు పండ్లు వంటివి పండిస్తూ.. వాటిని విక్రయించి లాభాలను ఆర్జిస్తుంటారు.
పైగా వీటి కోసం ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా అందిస్తుంటుంది. ఇప్పటికే ఇంటి దగ్గరే ఉండి ఇలా పండ్లు, కూరగాయలు, పూలు పండించుకుంటూ లాభాలను ఆర్జించే మహిళలను చూసే ఉంటాం. కానీ, ఎక్కడైనా ఇంటి మిద్దెలపై చేపల పెంపకం చేసి బిజినెస్ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా ? వినగానే ఇలా కూడా చేస్తారా అనే ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ, నిజంగానే కొంతమంది మహిళలు ఇంటి మిద్దే మీదే చేపలు పెంపకం చేసి రూ.2.50 లక్షలు సంపాదిస్తున్నారు. ఇంతకి ఎక్కడంటే..
తెలంగాణ రాష్ట్రంలోని భూంపల్లికి చెందిన కొంతమంది మహిళలు ఇంటి మిద్దెలపై చేపలు పెంచుతూ లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఇంటి మిద్దెలతో పాటు వ్యవసాయ క్షేత్రాల్లో ప్రత్యేకంగా ట్యాంకులు ఏర్పాటు చేసి చేపల పెంపకం చేపడుతున్నారు. పైగా వీరికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సహకారం కూడా అందిస్తోంది. అయితే ఈ చేపల పెంపకం కోసం మహిళలు వారం రోజులు ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా తీసుకున్నారట. ఇక ఇందులో లాభం ఉంటుదని తెలిసే ఈ చేపల బిజినెస్ ను ప్రారంభమించమని ఆ మహిళలు తెలిపారు. ఇక ఈ చేపల పెంచే యూనిట్ ప్రభుత్వం నుంచి రూ.3 లక్షల వరకు లోన్ తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే కామరెడ్డి డీఆర్‌డీవో సాయన్న మాట్లాడుతూ.. ఇంటి మిద్దెలపై తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందేందుకు ఈ చేపల పెంపకం యూనిట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
పైగా ఈ స్కీం ద్వారా ఇంటి మిద్దెలపై సుమారు వెయ్యి చేపలు పెంచేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే ఇక్కడ పెంచిన కొర్రమీను చేపలు ఒక్కొటి కేజీ వరకు బరువు తూగుతుందని తెలిపారు. ఇకపోతే ఈ చేపలు మార్కెట్ లో కేజీ రూ. 350 పలుకుతుందని, దీని వల్ల రూ. 3.50 లక్షల వరకు ఆదాయం పొందవచ్చని ఆయన తెలిపారు. ఇకపోతే ఇక్కడ పెంచిన చేపలు ఒక కేజీ పెరిగే వరకు కేజీన్నర ఫీడ్ తింటుదని వెల్లడించారు. కనుక చేపలు పెంచే మహిళలకు ఈ ఫీడ్ ఖర్చ రూ. లక్ష తీసియగా.. రూ. 2.50 లక్షల ఆదాయం మిగులుతుందని పేర్కొన్నారు. మరి, ఇంటి మిద్దేల పై చేపల పెంపకంతో లక్షల్లో సంపాదిస్తున్న మహిళ కొత్త బిజినెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.