గోధుమ ధాన్యల్లో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. గ్లూటెన్ లేకుండా ఉండే రోటీ కోసం చూస్తున్నట్లైతే వారికి జొన్న రొట్టే బెస్ట్. ఎందుకంటే జొన్న రొట్టెలో గ్లూటెన్ ఎక్కువగా ఉండదు.
అందువలన గ్లూటెన్ సెన్సిటివిటీతో బాధపడే వారు గోమ రొటీ తినడం వలన కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తుంటాయి. అందువలన వారు గోధఉమ పిండి రోటీ కంటే జొన్న రోటీ తినడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతుందంట. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
బరువు తగ్గాలి అనుకునే వారు గోధుమలతో చేసే రోటీ కంటే, జొన్న రొట్టె తినడం చాలా మంచిది. ఎందుంకంటే? జొన్నల్లో అధిక ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే కడుపు నిండిన అనుభూతినిచ్చి, ఆకలిని తగ్గిస్తుంది. అలాగే శరీరానికి శక్తిని అందిస్తుంది.
ప్రతి రోజూ క్రమం తప్పకుండా జొన్న రొట్టే తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. దీనిని ప్రతి రోజూ మీ డైట్‌లో చేర్చుకోవడం వలన ఇది భోజనం చేసిన తర్వాత కలిగే కడుపు ఉబ్బరం, వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుందంట. అలాగే జీర్ణవ్యవస్థలో అసౌకరర్యాన్ని తగ్గిస్తుంది. మరీ ముఖ్యంగా గోధుమ రొట్టెల కంటే జొన్న రొటీలు త్వరగా జీర్ణం అవుతాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో జొన్నరొట్టెలు కీలక పాత్ర పోషిస్తాయి. తెల్ల బియ్యం, మైదా వంటి ధాన్యాలతో పోలీస్తే జొన్నల్లో తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. అందువలన ఇది చాలా త్వరగా రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తుందంట. అందువల మధు మేహ వ్యాధిగ్రస్తులకు బెస్ట్ ఫుడ్ ఇది.
జొన్న రొట్టెలు అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో శరీరానికి మేలు చేసే ఫైబర్ విటమిన్స్, టానిన్లు, ఫినోలిక్ ఆమ్లాలు, ఆంథోసైనిన్లు, ఫైటోస్టెరాల్స్ , పోలికోసనోల్స్ వంటి ఫైటోకెమికల్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని మీ డైట్‌లో చేర్చుకోవడం వలన ఇది శరీరంలోని వాపును తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
































