నగదు బ్యాంక్ ఖాతాలో ఉంటే.. గుట్టు చప్పుడు కాకుండా.. దేశం కానీ దేశంలొని సైబర్ నేరగాళ్లు.. సైలెంట్‌గా కొట్టేస్తున్నారు. అలాంటి వేళ.. అకౌంట్‌లో నగదు అధికంగా ఉంటే.. వాటిని ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఉంచుకోవడం మేలని బ్యాకింగ్ రంగ నిపుణులు వివరిస్తున్నారు.
పలు బ్యాంకులు తన కస్టమర్లకు 2 నుంచి 3 సంవత్సరా ఎఫ్‌డీలపై 7.15 నుంచి 7.65 శాతం వడ్డీని అందిస్తోంది. మీరు రూ. 2 లక్షలు..మూడేళ్ల పాట్ ఎఫ్‌డీ చేస్తే.. మీకు రూ. 51, 050 వడ్డి వస్తుంది. రెపో రేటు తగ్గింపు కారణంగా వడ్డీ రేట్లు త్వరలో తగ్గవచ్చుననే చర్చ జరుగుతోంది.
ఎస్‌బీఐ, కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర ప్రభుత్వ బ్యాంకులు.. ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఇది తన కస్టమర్లకు పొదుపు ఖాతాలపై మంచి వడ్డీ రేట్లను అందిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యాంకులు ఒక ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని తీసుకువచ్చాయి. ఈ పథకంలో ఎవరైనా రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే.. అందుకు ప్రతిగా రూ. 51,050 వడ్డీ లభిస్తుంది.
ఎఫ్‌డీ ప్లాన్ అంటే ఏమిటి? మీరు ఒకసారి ఇందులో నగదు పెట్టుబడి పెట్టండి. ఆ డబ్బును మీరు కొన్ని సంవత్సరాలు దాచుకోండి. ఆ నగదుకు బ్యాంకు వడ్డీ చెల్లిస్తుంది. ఈ బ్యాంకులు 2 నుంచి 3 సంవత్సరాల ఎఫ్‌డీలపై మంచి వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. సామాన్యులకు వడ్డీ రేటు 7.15 శాతం ఉండగా.. సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం వడ్డీ లభిస్తుంది.
మీకు ఎంత లాభం వస్తుందంటే.. మీరు ఓ సాధారణ వ్యక్తి అయితే.. మీరు 3 సంవత్సరాలకు రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే, మీకు రూ.2,47,379 వస్తుంది. అంటే రూ.47,379 వడ్డీ వస్తుంది. మీరు సీనియర్ సిటిజన్ అయితే..మీరు 3 సంవత్సరాలకు రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తే, మీకు రూ.2,51,050 లభిస్తుంది. అందులో రూ.51,050 వడ్డీ అవుతుంది.
444 రోజుల ప్రత్యేక ప్రణాళిక: ఈ బ్యాంకులు కొత్తగా 444 రోజుల ఎఫ్‌డీని ప్రవేశపెట్టింది. ఇందులో సామాన్యులకు 7.15% వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.65% వడ్డీ లభిస్తుంది. మీరు ఈ పథకంలో 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే.. 444 రోజుల తర్వాత మీకు మంచి రాబడి లభిస్తుంది. అంటే.. ఇది ఒక సంవత్సరం కంటే కొంచెం ఎక్కువ కాలం నగదు ఎఫ్‌డీ రూపంలో ఉంచాల్సి ఉంది.
రెపో రేటు తగ్గింపు అంటే.. ఈ రోజు అంటే బుధవారం..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 0.25% తగ్గించింది. రెపో రేటు అంటే బ్యాంకులు ఆర్‌బిఐ నుండి తీసుకునే రుణంపై చెల్లించే వడ్డీ రేటు. ఇది తగ్గితే, రుణంపై వడ్డీ తగ్గుతుంది.కానీ ఎఫ్‌డీ వడ్డీ కూడా తక్కువగా ఉంటుంది. దీంతో ప్రస్తుతం అన్ని బ్యాంకులు ఎఫ్‌డీల వడ్డీని తగ్గించవచ్చు.
పెట్టుబడి పెట్టడం మంచి ఆలోచన: ఎఫ్‌డీ వడ్డీ త్వరలో తగ్గుతుంది. కాబట్టి, మీరు ఇప్పుడు పెట్టుబడి పెడితే, మీరు అధిక లాభం పొందవచ్చు. ఉదాహరణకు 3 సంవత్సరాల ఎఫ్‌డీ ఇప్పుడు 7.65% వడ్డీని ఇస్తుంది.కానీ భవిష్యత్తులో ఇది 7 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉండవచ్చు.అప్పుడు లాభం కూడా తక్కువగా ఉంటుంది.
ఎవరు ఎఫ్‌డీ చేయవచ్చునంటే.. ఎవరైనా చేయవచ్చు. సాధారణ ప్రజలకు ఒకటే వడ్డీ రేటు ఉంటుంది. కానీ సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ రేట్లు లభిస్తుంది. మీ సమీపంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు వెళ్లి ఎఫ్‌డీ చేయవచ్చు. దీనిని ఆన్‌లైన్‌లో కూడా చేయవచ్చు.
ప్రయోజనం ఏమిటింటే? ఈ ఎఫ్‌డీలో నగదు సురక్షితం. ఈ వడ్డీకి హామీ ఉంటుంది. మీరు రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే, 3 సంవత్సరాలలో మీకు రూ.51,050 లాభం వస్తుంది. ఇది భవిష్యత్తుకు మంచి పొదుపు. రుణాలతో పాటు ఎఫ్‌డీలపై వడ్డీ కూడా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడే పెట్టుబడి పెట్టడం లాభదాయకమని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.
అదీకాక నగదు.. బ్యాంక్ ఖాతాలో లాగే ఉంటే.. గుట్టు చప్పుడు కాకుండా.. దేశం కానీ దేశంలొని సైబర్ నేరగాళ్లు.. సైలెంట్‌గా కొట్టేస్తున్నారు. అలాంటి వేళ.. అకౌంట్‌లో నగదు అధికంగా ఉంటే.. వాటిని ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఉంచుకోవడం మేలని బ్యాకింగ్ రంగ నిపుణులు సైతం వివరిస్తున్నారు.