అవిసె గింజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మన అందరికీ తెలుసు. అవిసె గింజలు చూసేందుకు చిన్నవే అయినా ప్రయోజనాలు అందించడంలో మాత్రం చాలా పెద్దవి.
నిత్యం మనం తీసుకునే ఆహారంలో భాగంగా ఈ ఫ్లాక్ సీడ్స్ ని యాడ్ చేసుకోవటం వల్ల జీవక్రియను పెంచి బరువును తగ్గించడంలో సాయపడతాయి. అంతేకాదు.. పొట్ట కొవ్వును కరిగించడంలో కూడా ఈ చిన్న గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీటిలో అవిసె గింజల పొడిని కలిపి తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కావాలంటే ఈ నీటికి నిమ్మరసం, తేనె కూడా కలుపుకోవచ్చు. ఈ పద్ధతి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలో కొవ్వున కరిగించి త్వరగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. అలాగే, పెరుగు, అవిసె గింజలను కూడా కలిపి తీసుకోవచ్చు. దీనితో పొట్ట నిండుగా అనిపిస్తుంది.
ఇందుకోసం ఒక గిన్నె పెరుగులో అవిసె గింజల పొడిని తీసుకుని మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఆపిల్ లేదా అరటిపండు కూడా వేసుకోవచ్చు. లేదంటే, ఒక చెంచా అవిసె గింజలు రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. ఈ నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇదే నీటిని రాత్రి నిద్రకుముందు తాగేయటం వల్ల మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ డీటాక్స్ డ్రింక్ జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగపడుతుంది. దీనితో పొట్ట కొవ్వు త్వరగా కరిగిపోతుంది.
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
































