Flax Seeds With Curd : ఉదయాన్నే పరగడుపునే తీసుకోండి.. షుగర్‌, కొలెస్ట్రాల్‌, గుండె జబ్బులు ఉండవు..

Flax Seeds With Curd : మన ఇంట్లో తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.


మలబద్దకం, అజీర్తి సమస్యలతో బాధపడే వారు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఉంటాం. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి.

చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా తయారవుతాయి. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే ఈ మిశ్రమాన్ని ఏ సమయంలో తీసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి మనం అవిసె గింజలను, పెరుగును, తేనెను ఉపయోగించాల్సి ఉంటుంది. అవిసె గింజలు మనందరికి తెలిసినవే. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.

వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. అవిసె గింజల్లో ఉండే ఔషధ గుణాలు అనారోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి.

అవిసె గింజలతో ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల పెరుగును తీసుకోవాలి.

Flax Seeds With Curd

తరువాత ఇందులో ఒక టీ స్పూన్ అవిసె గింజల పొడిని వేసి బాగా కలపాలి. తరువాత రుచికి తగినంత తేనెను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి.

పెరుగులో అవిసె గింజల పొడిని కలిపిన వెంటనే ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. అవిసె గింజలతో చేసిన ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియలు రేటు కూడా పెరుగుతుంది. బరువు కూడా తగ్గవచ్చు.

ఈమిశ్రమాన్ని తీసుకోవడం వల్ల రక్తం కూడా శుద్ది అవుతుంది. స్త్రీలు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.

పిల్లల నుండి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరు ఈ అవిసె గింజల మిశ్రమాన్ని తీసుకోవచ్చు. అవిసె గింజల పొడిని ఈ విధంగా పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.